ఫైరింగ్.. ఫైరింగ్… ఫైరింగ్. ఆయన మాటలు ఓ ఫైరింగ్.. ఆయన చేతలూ ఓ ఫైరింగ్… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాలను గాలిలోకి వదిలి తనో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో ఇలాగే ఓ చోట ఫైరింగ్ చేయడం వివాదస్పదమవగా… తనకు ఎస్పీ ఇచ్చాడని, గాలిలో సరదాగా కాల్పులు జరిపానని ఏదో చెప్పుకున్నాడు. కానీ ఇది వివాదస్పదమయ్యింది. మొన్నామధ్య మహబూబ్‌నగర్‌లో కిడ్నాప్‌ల కలకలం మంత్రి మెడకే చుట్టుకుంది.
ఇది ప్రభుత్వానికి కొత్త నెత్తినొప్పులు తెచ్చిపెట్టింది. ఈ విషయంలో ఇంకా సర్కార్ ఊపిరి కూడా తీసుకోలేదు… మరో వివాదంతో మళ్లీ అగ్గిబరాటా అయ్యాడు మన మంత్రి. సరదాగా మళ్లీ గాలిలో కాల్పులు కాల్చి వార్తల్లోకెక్కాడు. ఇటీవల వరంగల్ జరిగిన ఓ మీటింగులో మళ్లీ గాలిలో కాల్పులు జరిపాడు. అంతకు ముందు ఎస్పీ ఇచ్చాడని తప్పించుకున్నాడు.. మరిప్పుడెవరిచ్చారు…? అసలు మంత్రికి తుపాకీ ఎందుకివ్వాలి..? ఎవరు అనుమతిచ్చారు. ..? ఈ సంఘటనకు ఎస్పీని బాధ్యుడని చేసి సస్పెండ్ చేయాలి… ఇదిప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి. మంత్రికి ఎక్సైజ్, పర్యాటక, స్పోర్ట్ ఫోర్ట్ ఫోలియోలున్నాయి… కానీ ఫైరింగ్ శాఖకు మంత్రిని చేస్తే బాగుండని అంతా నవ్వుకుంటున్నారు వెటకారంగా.