బాజిరెడ్డి గోవర్దన్… మాస్ లీడర్. ఓటమెరగని బీసీ నేత. అన్ని వర్గాలకు ఎప్పుడూ అండగా అందుబాటులో ఉండే నాయకుడు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు బాజిరెడ్డి జగన్. చిన్నప్పట్నుంచి తండ్రి రాజకీయాలకు, ప్రజలకు సేవ చేసే తత్వాన్ని బాగా దగ్గరగా చూసిన జగన్ నాయకుడంటే తండ్రిలా ఉండాలె అని చిన్నతనం నుంచే ఓ నిర్వచనానికి వచ్చాడు. ఎదిగినా కొద్దీ తండ్రి వ్యవహార దక్షత, ప్రజా సేవ పట్ల మరింత ఆకర్షితడవుతూ వచ్చాడు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకునేందుకు ఎప్పుడూ ముందుండేవాడు. తండ్రి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో జగన్‌కు నియోజకవర్గ ప్రజలతో మరింత దగ్గరయ్యే అవకాశం దొరికింది. ఏ ఆపద ఎవరికొచ్చినా… పిలిస్తే పలికే నాయకుడిగా తనే ముందుంటూ వారికి భరోసాగా నిలుస్తున్నాడు. ఎవరు తనువు చాలించినా… వారి అంత్యక్రియల్లో పాల్గొని ఆ కుటుంబాలకు పెద్దన్నగా గుండె ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇతోధికంగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.
తండ్రి బాజిరెడ్డి తన రాజకీయ వారసుడిగా జగన్ ను ప్రకటించారు. ఇదే విషయాన్ని పలుమార్లు కేసీఆర్ , కేటీఆర్‌ల వద్దా ప్రస్తావించారు. కేసీఆర్ కూడా గోవర్ధన్ అభ్యర్థనను ఆమోదించారు. ఓకే ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మరింత రెట్టించిన ఉత్సాహాంతో పనిచేస్తున్నాడు. అర్థరాత్రి.. అపరాత్రి అని తేడా లేకుండా ఎవ్వరు ఎప్పుడు పిలిచినా వెంటనే స్పందిచే తత్వం జగన్‌ది. ఎవరికేమీ ఆపద వచ్చినా నేనున్నాననే అభయాన్నిచ్చి రూరల్ ప్రజలకు కొత్త ఆశాకిరణంగా జగన్ ఇప్పుడు పరిపక్వత చెందిన నాయకుడిగా రూపుదిద్దుకున్నాడు. విద్యావంతుడు, సమస్యలపై సత్వరం స్పందించే గుణం… రాజకీయాల్లో విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టే నైజం… ప్రతిపక్షాల కౌంటర్లకు హుందాగా ఎన్‌కౌంటర్ లిచ్చే తత్వం.. వెరసి ఆయనను ఓ ప్రత్యేక లీడర్‌గా నిలపాయి. బీసీ లీడర్‌గా ప్రజల వద్ద అపారమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బాజిరెడ్డి గోవర్ధన్ … వారసుడిగా అదే పంథాను కొనసాగించేందుకు జగన్ అనుసరిస్తున్న విధానం, ప్రజాసేవ , పద్దతులు నియోజకవర్గ ప్రజల మెప్పు పొందుతున్నాయి.