అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు
24 గంటలు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉంటానని ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు
నిద్రాహారాలు లెక్క చేయకుండా మంత్రి రాత్రంతా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు,ఎగువ నుంచి గోదావరి లోకి వస్తున్న వరద, నిండుతున్న చెరువులు, పొంగిపొర్లుతున్న వాగుల పై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రాణనష్టం సంభవించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆస్తి నష్టం జరిగితే మళ్లీ పునరుద్దరించుకోవచ్చు…కానీ ప్రాణం తిరిగి తెలేమన్నారు.
అధికారులు నిండిన చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని…లోతట్టు గ్రామాల ప్రజలను అలెర్ట్ చేయాలన్నారు.
చేయి దాటి పోయే పరిస్థితులు ఉంటే వెంటనే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అదేశించారు.
పోలీసు,రెవెన్యూ,ఇరిగేషన్, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ముంపు గ్రామాల ప్రజలను గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు,పోలీసు యంత్రాంగం తరలించే ఏర్పాట్లు చేయాలని,రెవెన్యూ అధికారులు వారికి పునరావాసం,బోజన వసతి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తహిసిల్దార్లు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
కొంతమంది జె వైర్లను,ఇనుప తీగలను దండేలుగా కట్టుకుని బట్టలు ఆరేస్తారని,వాటి వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందన్నారు.
అట్లాంటి వాటిపై అవగాహన కల్పించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు కూడా అధికార యంత్రాంగం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటుందని, వారి ప్రాణ రక్షణే మా ప్రథమ కర్తవ్యం అన్నారు.
ప్రకృతి విపత్తుల వల్ల ఎంత ఆస్థి నష్టం జరిగినా దాన్ని రిస్టోర్ చేయగలం.. కానీ ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు,పునరావాస కేంద్రాలను పరిశీలించారు.
నగరంలోని బాబాన్ సాహెబ్ పహాడ్, మాలపల్లి, ఇంపీరియల్ గార్డెన్ గుపన్ పల్లి ప్రాంతాల్లోని పరిస్థితులు పర్యవేక్షించారు. అక్కడ ప్రజలతో మమేకమయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గూడె చెదిరి గుండె బరువెక్కిన జనానికి నేనున్నానంటూ భరోసానిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.