ప్రేక్షకుడి సినీ నాలెడ్జ్ విపరీతంగా పెరిగింది. సునిశిత దృష్టితో ప్రతీ కోణాన్ని స్పృశిస్తున్నారు. పాటలు, సంగీతాలు, సీన్లు, ఫైట్లు.. ఇలా ఏవైనా కాపీ కొట్టారో వాళ్ల బండారం క్షణాల్లో బయటపెడుతున్నారు సోషల్ మీడియాలో.తాజాగా ది వారియర్ సినిమా పోస్టర్‌పై సెటైర్లు వేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు తమిళ, తెలుగు భాషల్లో తీసిన ది వారియర్ సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది. కృతిశెట్టి హిరోయిన్. ఆది పినిశెట్టి విలన్. తమిళ దర్శకుడు ఎన్ లింగు స్వామి తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
తొలిసారిగా రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. హిరో రామ్ మక్కబుట్టను తినే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీన్ని కూడా వదలలేదు మనోళ్లు. ఏమయ్యా డైరెట్రు… ఆ మక్కకంకిని కాల్చి కదా తినాల్సింది. అలా పచ్చిదే తినిపించేస్తున్నావే… నువ్వేం డైరెట్రయ్యా బాబు… అంటూ పంచులేస్తున్నారు. కాదు అది ఉడకబెట్టిన బుట్ట అని కొందరు సమర్థించినా… ఉడకబెట్టిన మక్కకంకిని పొట్టుతో ఉడకబెట్టరు. దానికి బూరు కూడా ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా పచ్చి బుట్టనే. దాన్నే హిరో తింటున్నట్టు ఫోటో తీశారు. అంటూ వాదనలు , ప్రతివాదనలు… వెక్కిరింపుల.. చమత్కారాలు అన్నీ నడుస్తున్నాయి. అలా ఉంది మరి మనోళ్ల సినీ నాలెడ్జ్. సినిమా విడుదలైన తర్వాత ఎన్ని వంకలు వెతుకుతారో…?