2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను రద్దు చేయడంతో రూ.6.5 లక్షల మంది రైతులు మాత్రమే రుణ విముక్తులయ్యారు. మిగిలిన36 లక్షల మంది రైతులు బ్యాంకులకు బాకీ పడి ఉన్నారు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం 2వ సారి కూడా 4 విడతలుగా మాఫీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి బాకీలు పూర్తిచేయాలి. కానీ ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతుల రుణార్హత సందిగ్ధంలో పడింది.
M N Reddy 9393044448