హైదరాబాద్ రేప్ కేస్ ఘటన టీఆరెస్‌ను ఆత్మసంరక్షణలో పడేసింది. ఏకంగా హోం మినిష్టర్ మనువడి ప్రమేయమే ఇందులో ఉందనే వాదన బీజేపీ బలంగా వినిపించడం.. ఆధారాలున్నాయని చెప్పడం… అటు పోలీస్ శాఖను, ఇటు టీఆరెస్‌ను ఇరకాటంలో పడేసింది. నిందితులు టీఆరెస్ పార్టీకి చెందిన వారుగా తేలడం కూడా బీజేపీకి మరింత బలాన్నిచ్చింది. దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు అన్ని రకాల ప్రయోగాలకు సిద్దమైంది బీజేపీ.
మరోవైపు సోషల్ మీడియాలో దాడి, ఎదురుదాడులు జరుగుతున్నాయి. బీజేపీ హోం మినిష్టర్ మనువడు కేసీఆర్‌తో దిగిన ఫోటోలను పెట్టి దీన్ని మరింత వైరల్ చేయాలని చూస్తున్నారు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇది బలవంతంగా చేసినట్టు లేదు.. ఇష్టపూర్వకంగానే కలిసినట్టు ఉందని సమర్థించే క్రమంలో కొంత విమర్శలు ఎదుర్కొంటున్నది. అయినా వెనక్కి తగ్గడం లేదు. దాడి, ఎదురు దాడులు పెరిగాయి. మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించడం… వెంటనే దీనికి హోం మినిష్టరే సమాధానమివ్వడం కూడా బీజేపీ శ్రేణులకు అస్త్రంగా దొరికింది. ఓ మంత్రి ఆదేశిస్తే హోం మినిష్టర్ స్పందించడమా…? అసలు హోం మినిష్టర్ ర్యాంక్ ఏందీ..? ఓ మంత్రి ఆదేశిస్తే స్పందించి సమాధానమివ్వాల్సిన అవసరమా..? అంటూ దొరికిన ప్రతీ అవకాశాన్ని రాజకీయం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది బీజేపీ. మరోవైపు దీన్ని రాజకీయాలకు అతీతంగా కూడా విమర్శిస్తున్నారు చాలా మంది.
హైదరాబాద్‌లో పట్టపగలు, జన సమ్మర్థ్యం ఉన్నా కూడా ఈ దారుణమా..? మనమెటు పోతున్నాం..? యువత నడవడిక ఎలా మారుతున్నది..? అంటూ ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దీనిపై స్పందించాడు. పేద నిందితులును ఇక్కడ ఎన్‌కౌంటర్ చేస్తారు… ఇలాంటి వాళ్లను కాదు.. ప్రజలకు కూడా పేదలను చంపినప్పుడు ఎంజాయ్ చేశారు.. కానీ ఇలాంటి వాటి విషయంలో మాత్రం ప్రశ్నించరు… అనే విధంగా ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.