మాంచి గట్టి అద్భుత విశ్లేషణ..🤙
Tv9 సమాజ సేవ అంటుంటే చిరాకేసి ఈ పోస్ట్ పెడుతున్నాను…
విశ్వాక్ చేసిన ఫ్రాంక్ వీడియో మాట్లాడిన F పదం తప్పు.OK.
మీరు మాత్రం మీకు నచ్చిన హెడ్ లైన్స్ పెట్టి వాళ్ళని కించపరచవచ్చు.
దాని కోసం డిబేట్ లు పెట్టుకువచ్చు.
MLA, & మినిస్టర్ లను కూడా కలుస్తునారు.
👉రైతుల కోసం డిబేట్ లు పెట్టారా?
👉పెరుగుతున్న నిత్యావసరాల గురించి పెట్టారా?
👉సామాన్యుడు ఎలా బ్రతకాలి అని పెట్టారా?
👉ఇష్ట రాజ్యం గా వసూలు చేస్తున్న స్కూల్ ఫీజు ల గురించి పెట్టారా?
తల్లి తండ్రుల బాధల గురించి పెట్టారా?
👉హాస్పిటల్ కీ వెళ్ళితే లక్షలు లక్షలు ఎందుకు అవుతున్నాయి అని పెట్టారా?
👉నిరోద్యోగుల గురించి పెట్టారా?
కరెంటు లేక బ్రతకడానికి పని లేక పెరుగుతున్న పెట్రోల్, నూనె, బియ్యం, పప్పు లు, ఉప్పు ల వలనా ప్రజలు ఎంతల ఇబ్బంది పడ్తున్నారో వాటి కోసం పోరాటం చేసారా?
ఈ సమస్యల గురించి ఎపుడైనా MLA MP మినిస్టర్ లని కలిసారా?
మీకు అవి ఎందుకు పబ్లిసిటీ కావాలి.
TRP కావాలి.
ఒక నటి బాత్రూం లో స్నానం చేస్తున్న వీడియో టీవీ లో వేసి వేసి మరి చూపించింది ఎవరు.
ఆమె ఒక ఆడపిల్ల కదా .ఆమెకు కుటుంబం లేదా.
శ్రీ రెడ్డి రోడ్ మీద బట్టలు విప్పితుంటే పచ్చి బూతులు మాట్లాడుతుంటే కవర్ చేసింది మీరు కదా.
ఒక చిన్న పాప రేప్ కు గురి అయ్యి చనిపోతే
అది వదిలేసి,
సాయి ధర్మ తేజ్ ఆక్సిడెంట్ ఎలా ఆయింది?
ఏ స్పీడ్ లో వెళ్ళాడు?
ఏ బైక్?
దాని కాస్ట్ ఎంత?
ఇదేనా TV9 సమాజ సేవ.
దీనమ్మ జీవితం…
శ్రీదేవి చనిపోతే టబ్ లో పడుకుని మరీ చూపించింది ఎవరు?
ఇదేనా మీ సమాజ సేవ 😃.
న్యూసెన్స్ చేస్తుంది మీరు.
ఒకప్పుడు మీడియా అంటే ఒక వాల్యూ ఉండేది.
మీ tv9 ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుండే వాల్యూ పోయింది మీ తొక్కలో డిబేట్ లు. న్యూస్ ల వలన.
-శివ నాయుడు ✍️
