చినజీయర్ కండకావరంతో
కారుకూతలు…!
★★★
ఓరీ చినజీయర్ నీవు
మానవ జాతి అభివృద్ధి నిరోధక

మనుధర్మ శాస్త్రానికి
పుట్టిన వికృత రూపానికి
ఓ ప్రతిబింబానివీ….

ప్రపంచ దేశాల ముందు
తలదించుకునేలా చేసిన
కుల వ్యవస్థకు ప్రతిరూపానివి

ఒక స్వామిజీగా సామాజిక రుగ్మతులను
రూపుమాపే ధర్మ ప్రవాచనాల
ముసుగులో

ఇంటర్నేషనల్ స్కూల్స్
రియల్ ఎస్టేట్ దందాలతో
రాజ్యంగయేతర శక్తిగా
రాజ్యాంగ వ్యతిరేకిగా
రాజ్యాద్రోహిగా

చినజీయర్
కండకావరం కారుకూతలు
మద్య యుగాల ఆటవిక
ధర్మాలను జ్ఞాపకం చేస్త్తున్నది

ఒక అధ్యాత్మిక గురువుగా
ప్రజల మద్య శాంతి సందేశం
జాతీయ భావం,దేశభక్తిని
ప్రభోధించాలసిన
చినజీయర్ స్వామి

చెమట చుక్క నేలరాల్చకుండా
దళిత బహుజన ప్రజలు

నెత్తురు చెమట సేద్యంతో పండించిన
పంట గింజలతో
పసందైన విందులతో తెగబలిసిన కులోన్మాది
చినజీయర్

దళిత బహుజన ప్రజల
తిండిపై కారుకూతలు కూస్తే
ఏకలవ్వుడి వారసులమై
శంభూకుడి జ్ఞాన సంపదతో
పూలే,సావిత్రిల చరిత్ర నిర్మాతలమై

పెరియార్ ధిక్కారంతో
ఆధునిక గౌతమ బుద్ధుడు

రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్ ల
ఆశయాలతో ఏర్పడే
బహుజన రాజ్యంలో

రాజ్య శాసనం ద్వారా
చినజీయర్ లాంటి
చీకటి బతుకుల
బాగోతం బట్టబయలు కాకతప్పదు

చరిత్ర హీనులెందరో ప్రజా కోర్టులో
దోషులుగా నిలబడిన
రోజు ఒకటి వచ్చినప్పుడు
చినజీయర్ లైన ఎవరైనా సరే…
చరిత్ర చెత్తకుప్పలోకి విసిరేయకతప్పదు…..

జైభీం లాల్ సలాంలతో..
దండి వెంకట్✍️
23-1-2022

★ ఎస్సీ, ఎస్టీ, బిసిలు తినే తిండిపై
చినజీయర్ స్వామి కండకావరంతో
కారుకూతలు కుయడాన్ని నిరసిస్తూ…

You missed