ఇన్ఫెక్షన్స్ పీక్ స్టేజి కి చేరుకొని , ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలయిన రాష్ట్రాలు .. మహారాష్ట్ర , వెస్ట్ బెంగాల్ , పంజాబ్ , బీహార్ , రాజస్థాన్ , ఢిల్లీ .
కేసులు ఇంకా బాగా పెరుగుతున్న రాష్ట్రాలు .. కర్ణాటక . ఒరిస్సా , గుజరాత్
రెండు తెలుగు రాష్ట్రాల్లో { ఈ మాట నేను official డేటా ఆధారంగా కాకుండా నా సొంత డేటా ఆధారంగా చెబుతున్నాను } ఈ వారం లో పీక్ కు చేరుకొంటుంది . అత్యధిక ఇన్ఫెక్షన్స్ ఈ వారం జరుగుతాయి . వచ్చే వారం నుంచి తగ్గడం మొదలవుతుంది . ఇన్ఫెక్షన్ అంటే ఇంకా భయపడే వారు ఇంటినుంచి బయటకు రాకుండా ఉండాల్సిన సమయం ఇదే .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది వరకే వచ్చిపోయింది అని గతం లో చెప్పాను. అది కొంతవరకే కరెక్ట్ అని ఇప్పుడు పీక్ స్టేజి లో ఉందని గత వారం రోజులుగా నన్ను మెసెంజర్ లో సంప్రదిస్తున్న వందలాది మంది ఇస్తున్న సమాచారం బట్టి అర్థం అవుతోంది
కేరళ . అంతు చిక్కని విషయం . ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ రాష్ట్రం గురించి నాకు అర్థం కావడం లేదు .
దేశం మొత్తంగా చూస్తే కేరళ , ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి ఈ నెల చివరికి లేదా ఆలస్యం అనుకొంటే ఫిబ్రవరి పది కల్లా కేసులు బాగా తగ్గిపోతాయి .
మీ ఇంట్లో ఇమ్యూన్ కంప్రమైజ్డ్ వ్యక్తులు ఉన్నారా ? అంటే 1 . కిడ్నీ మార్పిడి సర్జరీ అయిన వారు . 2 . కాన్సర్ కెమోథెరపీ తీసుకొంటున్నవారు . 3 . ఎయిడ్స్ రోగులు . 4 . 75 సంవత్సరాలు దాటి తీవ్ర ఖాయిలా పడ్డవారు . 5 . అనారోగ్య సమస్యలతో మంచం నుంచి లేవ లేని వారు.. ఇలాంటి వారు మీ ఇంట్లో ఉంటే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టే హోమ్ స్టే సేఫ్ అనే మాటను కొంత మంది అదే పనిగా వాడేస్తుంటారు. అందుకే నాకు ఆ మాట అంటే చిరాకు . కానీ ఇక్కడ చెప్పిన కేటగిరీ వ్యక్తులు ఉన్న ఇంటివారు ఈ రోజు నుంచి అంటే జనవరి 17 నుంచి ముప్పై దాక పాటించాల్సిన సూత్రం స్టే హోమ్ ..
(Amarnath Vasireddy)