ఎవరు విలేకరి.. విలేకరి హక్కులేమిటి.. భావ ప్రకటన స్వేచ్చ అంటే ఏమిటి..? యూట్యూబర్లు విలేకరులు కాదు.. వారికి హక్కులు లేవు.. ఇంకా ఏవోవే టాపిక్‌లు వచ్చాయి ఈ మధ్య చర్చకు. కేటీఆర్ కొడుకు హిమాన్షు మీద బాడీ షేమింగ్‌కు దిగజారిన తీన్మార్ మల్లన్న ఉదంతంపై ఇలా వెంటనే రంగంలోకి దిగి స్పందించాడు. అప్పటి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆయన దాదాపుగా తెరవెనుకే ఉన్నాడు. ఎప్పుడూ బయటకు రాలేదు. వచ్చినా కొద్దిసేపే. నిమిత్తమాత్రమైన ఆ పోస్టు విలువే అంతా అని తెలుసుకున్నాడేమో. యూట్యూబర్లను పట్టుకుని ఎడాపెడా వాయించేస్తున్నా అంతా కరెక్టే అన్నారు. తగిన శాస్తి జరగాల్సిందేనన్నారు.
ఇది ఎవరూ ఊహించని పరిణామం రాష్ట్రంలో. కేటీఆర్ మార్కు పాలన అమలవుతోంది రాష్ట్రంలో. అంతా బాగానే ఉంది గానీ.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాశాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి .. తన అనుచరులతో సాక్షి విలేకరి పోశెట్టిపై దాడి చేయించాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా పోశెట్టి బతికిబయటపడ్డాడు. మరి దీనిపై తమరేమన్నా స్పందిస్తారా.. అల్లమన్నా..? అసలు పోశెట్టి విలేకరే కాదంటారా ..? కొంపదీసి..
