నెల క్రితం అంటే డిసెంబర్ 9 న భారత దేశం లో మొత్తం కేసుల సంఖ్య 8503 . ఈ రోజు అంటే జనవరి 8 వ తేదీ మొత్తం కేసులు ఒక లక్షా నలభై వేల మూడు వందల డెబ్భై నాలుగు . అంటే కేసులు పదహారు రెట్లు పెరిగాయి . అదే రోజు అంటే డిసెంబర్ తొమ్మిది న మన దేశం లో మొత్తం మరణాలు 624 . ఈ రోజు అంటే జనవరి ఎనిమిది న మొత్తం మరణాలు 15 . అంటే మరణాలు 41 రెట్లు తగ్గిపోయాయి .
ఇది చాలదా ?
దీని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటి ?
1 . దేశం లో ఇప్పుడు పెరుగుతున్నది ఓమిక్రాన్ కేసులు .
2 . ఓమిక్రాన్ డెల్టా ను తుడిచిపెట్టొస్తోంది . ఎప్పుడైతే డెల్టా కేసులు తగ్గిపోతున్నాయో అప్పుడు మరణాలు తగ్గిపోతున్నాయి .
3 . ఓమిక్రాన్ వల్ల మరణాలు సంభవించడం లేదు . పైగా అది ఒక వాక్సిన్ లా, డెల్టా కు విరుగుడుగా పని చేస్తోంది .
4 . కరోనా కు మందు కనిపెట్టలేక డెల్టా వేవ్ సమయం లో కరోనా రోగులకు స్టెరాయిడ్ లు వేయడం వల్ల ఏమి జరిగిందో అందరికీ తెలుసు . చైనా వాడు సృష్టించిన ప్రళయానికి ప్రకృతి / దేవుడు ఇచ్చిన విరుగుడే ఓమిక్రాన్ .
5 . ఓమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు . ఓమిక్రాన్ కరోనా పీడా ను తొలగించడానికి వచ్చిన కరోనా శాంత స్వరూపం .
6 . మరణాలు తగ్గిపోతుంటే మెడికల్ మాఫియా కు ఎందుకంత బాధ ? ఎందుకంత విష ప్రచారం ? రోజూ కేసులు కేసులు అని భయపెడుతున్నారు .. మరణాలు తగ్గిపోవడాన్ని చెప్పడం లేదు . ఇది పచ్చి మోసం కాదా ?
7 . ప్రపంచ అనారోగ్య సంస్థ ఓమిక్రాన్ నే చివరి వేరియంట్ అని చెప్పలేము అంటోంది . వైరస్ నిరంతరం మ్యుటేట్ అవుతుంటుంది . నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అంటే వందేళ్ల క్రితం పండెమిక్ కు కారణం అయిన స్పానిష్ ఫ్లూ వైరస్ ఇప్పటికి ఎన్ని సార్లు రూపాంతరం చెంది ఉంటుంది ? ఎన్ని లక్షల వారియెంట్ లు పుట్టుకొని వచ్చి ఉంటాయి ? ఏదైనా తిరిగి ప్రాణాలు తీసిందా ? రోజుకో అబద్దం తో మీరు ఎందుకు జనాలను బెంబేలు ఎత్తిస్తున్నారు ? జనాలను వారి బతుకులు వారిని బతక నివ్వరా ? ఫార్మాసురులు ఈ పండెమిక్ నిరంతరం ఉండాలని కోరుకోవడాన్ని ఇది తెలియచేస్తుంది . జనాలు ఛస్తే మీకు పండగా ?
8 . మొదటి రెండు వేవ్ లో కేసులు వేరు .. ఇప్పుడు వస్తున్న కేసులు వేరు . అప్పుడు కేసులు పెరిగితే మరణాలు పెరిగాయి . ఇప్పుడు కేసులు పెరిగితే మరణాలు తగ్గుతున్నాయి . అదే తేడా .
9 . నెల క్రితం ఓమిక్రాన్ వల్ల సమస్య లేదు అంటే అప్పుడే చెప్పలేము అన్నారు . ఈ నెల రోజుల్లో సోకిన వారు ఎంత ? నూటికి తొంబై అయిదు మందికి అసలు లక్షణాలు లేని మాట వాస్తవం కాదా ? మిగతా ఆ అయిదు మందికి కూడా కేవలం స్వల్ప లక్షణాలు ఉన్న మాట వాస్తవం కాదా ? ఢిల్లీ ముంబై నగరాల్లో వేలమందికి సోకినా కరోనా సుపత్రుల్లో బెడ్స్ ఖాళీ అయిపోతుండడం వాస్తవం కాదా ?
10 . ఓమిక్రాన్ వల్ల తొలి మరణం రాజస్థాన్ లో అని ప్రచారం . ఆ వ్యక్తి వయస్సు 73 ఏళ్ళు . ఓమిక్రాన్ సోకి కోలుకున్నాడు . అతనికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణిస్తే ఆ మరణాన్ని ఓమిక్రాన్ ఖాతా లో వేస్తారా ? కరోనా లేకపోతె మరణాలు లేని ప్రపంచాన్ని తీసుకొని రాగలరా ? కరోనా రాక ముందు మరణాలు ఉండేవి కావా ?
11 . ఓమిక్రాన్ తో ఇప్ప్పుడు ప్రమాదం లేక పోయినా కోలుకున్నాక సమస్యలు ఉంటాయి అని మరో విష ప్రచారం . తోలి ఓమిక్రాన్ కేసును కనుగొన్న దేశం దక్షిణాఫ్రికా . ఇప్పటికి యాభై రోజులయ్యింది . వేలమందికి సోకింది . ఒక్కరంటే ఒక్కరికి కోలుకున్నాక పోస్ట్ ఓమిక్రాన్ సమస్యలు ఉన్నాయని డాక్టర్ లు చెప్పారా ? లేని దాన్ని ఉన్నట్టు , ఉన్నదాన్ని లేనట్టు మీరు ఎందుకు ప్రచారం చేస్తారు ?
12 . ఓమిక్రాన్ వల్ల అమెరికా లో ఆసుపత్రిలో చేరుతున్నారు . నిజమే . జలుబుకు నాల్గు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యే అమెరికా తో మన దేశాన్ని పోల్చడం ఏమైనా న్యాయమా ? మన దేశం లో ఓమిక్రాన్ అడుగుపెట్టి యాభై రోజులయ్యింది . ఇక్కడ ఏమి జరుగుతుందో మీకు కనబడదా?
Amarnath Vasireddy