✍️ ప్రస్తుతం జరిగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదలాయింపులో ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు ఒకరకంగా, బీసీ ఉద్యోగులకు ఇంకొక రకంగా నిబంధనలు పెట్టి బీసీల పై రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివక్షత చూపిస్తున్నారని, 317 జిఓ తీసుకువచ్చి బిసి ఉద్యోగ, ఉపాధ్యాయులను బలి తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

👉 నేడు హైదరాబాదులోని దిల్కుషా అతిథి గృహంలో బిసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయంపై జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ బీసీ కమిషన్ విచారణ చేపట్టింది, ఈ విచారణకు హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే సరిదిద్దాలని బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారికి ఒక వినతిపత్రాన్ని ఈ సందర్భంగా అందజేశారు,కమిషన్ ముందు బీసీ ఉద్యోగులు, ఉపాద్యాయుల గోడును ఈ సందర్భంగా వినిపించారు.

👉 తదుపరి అనంతరం మీడియాతో జాజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేష్ కుమార్ ఏకపక్షంగా ఎ సంఘాలతో, ఎవరితో చర్చించకుండా జోనల్ పేరుతో 317 జీవో తీసుకువచ్చి లక్షలాది మంది ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, స్థానికత, సీనియారిటీ అంటూ బీసీ ఉద్యోగుల, ఉపాధ్యాయులను ఉన్నట్టుండి పక్క జిల్లాలకు బదిలీ చేస్తున్నారని, గతంలో ఎప్పుడు ఒకేసారి ఉద్యోగులను, ఉపాధ్యాయులను బదిలీ చేయలేదని, ఇప్పుడు మాత్రం వారిని రాత్రికి రాత్రి అక్రమ బదిలీలు చేయడం దారుణమన్నారు, ఈ విద్యా సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తే ప్రభుత్వం బడుల్లో చదివే పేద విద్యార్థులు రోడ్డున పడతారని, లక్షలాది మంది విద్యార్థుల బౌవిష్యత్ పై ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

👉 వాస్తవంగా బీహార్ కు చెందిన సిఎస్ సోమేష్ కూమార్ ను తెలంగాణకు ఎలా నియమిస్తారని, ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని జూనియర్ గా ఉన్న సోమేశ్కుమార్ కు సి ఎస్ ను ఎలా చేశారని, సిఎస్ కు లేని స్థానికత, సీనియారిటీ ఉద్యోగులకు ఎందుకని ఆయన ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు బదిలీ అయిన సిఎస్ ను తెలంగాణకు ఎందుకు మార్ఛారని అని ఆయన అన్నారు,
గతంలో సిఎస్ మాటలు విని ముఖ్యమంత్రి గారు రిజిస్ట్రేషన్లు బందు చేస్తే,దాని పర్యవసానం దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయారని, ఇప్పుడు కూడా సీఎస్ మాటలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వింటే ఉద్యోగుల విషయంలో కేసీఆర్ గారు నిండా ఖాయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు
బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీలకు జరుగుతున్న అన్యాయం పై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ ఉద్యోగుల సంఘం కో ఆర్డినేటర్ చెంద్రశేఖర్, వీరప్ప, వరికుప్పల మధు, పాలకురి కిరణ్, తదితరులు పాల్గొన్నారు

(జాజుల శ్రీనివాస్ గౌడ్)
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర బీసీ
సంక్షేమ సంఘం

You missed