నిజామాబాద్,కామారెడ్డి,మెదక్,సిద్దిపేట జిల్లాల నుండి పాత 6వ జోన్లో రిక్రూట్ అయి,ప్రస్తుతం వేరే జిల్లాల్లో(కొత్త మల్టీ జోన్ -1) పని చేస్తున్న కొత్తగా రిక్రూట్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు ఎన్నటికీ వారి సొంత జిల్లాలకు పోలేరు. ప్రమోషన్ వచ్చి మల్టీ జోనల్ పోస్టులోకి వెళ్లిన కూడా సాధ్యపడదు.
అదే సమయంలో అదే పాత 6వ జోన్లోనే ఉన్న ఉమ్మడి రంగారెడ్డినల్లగొండ,మహబూబ్ నగర్ జిల్లాలు,హైదరాబాద్ సంగారెడ్డి ల నుండి రిక్రూట్ అయి అదే పాత జోన్ పరిధిలో ఉన్న వారి కొత్త జోన్,జిల్లాలో పని చేసే అవకాశం ప్రమోషన్ తర్వాతైనా ఉంటుంది.
*ఒకే ఉమ్మడి జోన్,రెండు విధానాలు.
*పాత 6వ జోన్ ఉమ్మడి జిల్లాలు
1)నిజామాబాద్ 2)మెదక్ 3)రంగారెడ్డి 4)హైదరాబాద్ 5)నల్గొండ 6) మహబూబ్ నగర్.
*కొత్త జోన్,మల్టీ జోన్ వివరాలు కింది పటంలో చూడచ్చు.
నేను కామారెడ్డి నుండి ఉమ్మడి ఆరవ జోన్ లోని హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడు కామారెడ్డి జిల్లా రాజన్న సిరిసిల్ల జోన్ మరియు మల్టీ జోన్ -1 లో ఉంది. నాకు ప్రమోషన్ వచ్చి మల్టీ జోనల్ పోస్టులోకి వెళ్లిన మళ్ళీ నా పాత ఆరవ జోన్లోని కామారెడ్డికి వెళ్లలేను. కానీ నల్గొండ,మహబూబ్ నగర్,రంగారెడ్డి,సంగారెడ్డి,హైదరాబాద్ నుండి 6వ జోన్లో రిక్రూట్ అయినవాళ్ళు మాత్రం వాళ్ళ సొంత జిల్లాకు పోవచ్చు. ఎందుకంటే అవన్నీ మల్టీ జోన్ -1 లో ఉన్నాయి కాబట్టి.
*ఒక్క కామారెడ్డి,నిజామాబాద్,మెదక్,సిద్ధిపేట మాత్రమే మల్టీ జోన్ – 1 లోకి వెళ్లి ఈ అసమానతలు.😥
*అదే పాత జోనల్ విధానం ఉంటే నాకు ఈ స్థితి రాకపోతుండే,నా ప్రమేయమే లేకుండా నా జిల్లాకు నేను నాల్ లోకల్ అయితున్న.😓
Nawin Samala