మూడో ప్రపంచ యుద్ధం లో మీరెటు ?
డెల్టా కంటే ఓమిక్రాన్ తక్కువ అని చెప్పడానికి ఆధారాలు లేవు – లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు .
నా వ్యాఖ్య :
సార్లు! .. డెల్టా, ఓమిక్రాన్ సంగతి తరువాత . ముందు గా మీరు చూడాల్సింది ఫ్లూ గురించి .
మా దేశం లో ఫ్లూ ను ఎవడూ సమస్య అనుకోలేదు . జలుబు- వచ్చేది, పొయ్యేది . దాన్ని లెక్కలు తీసినవాడు లేడు. కానీ మీ తెల్ల దొరల దేశాల్లో అదో పెద్ద సమస్య . వింటర్ అంటే మీకు ఫ్లూ సీజన్. అమెరికా లో సంవత్సరానికి నాలుగు కోట్ల మంది ఫ్లూ బారిన పడేవారు { కరోనా పూర్వ యుగం లో } అనేక లక్షల మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చేది . ఫ్లూ వాక్సిన్ సంవత్సరానికి రెండు డోసులు తీసుకొన్నా ఇరవై అయిదు వేల మంది చనిపోయేవారు . ఈ విషయం లో మీ దేశం మరింత ఘోరం . అమెరికా జనాభా తో పోలిస్తే మీ జనాభా తక్కువ . అయినా మీ దేశం లో కూడా సంవత్సరానికి ఇరవైఅయిదు వేల మంది ఫ్లూ వల్ల చనిపోయే వారు .
జలుబుకే మీ దేశానికి ఇంత డేంజర్ ఉంటే ఇక ఓమిక్రాన్ డేంజర్ కాకుండా పోతుందా సార్లు ? . మీరు చెప్పింది కరెక్ట్ . ఓమిక్రాన్ మీకు , అమెరికా కు, ఇంకా యురోపియన్ దేశాలకు డేంజర్ . ఇప్పుడే కాదు . ఇంకా అనేక సంవత్సరాల పాటు . నెగటివ్ మాటలు ఎందుకు అని అనుకొన్నాను . ఇక మీద ఏటా మీకు వింటర్ వస్తే ఫ్లూ దానికి తోడు కరోనా కొత్త రూపాలు . వాక్సిన్ వేసుకున్నామీకు పెద్దగా రక్షణ లేని దయనీయ స్థితి . ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కింది పాయింట్స్ గురించి ..
1 . ఇండియా ఇంకా అనేక దేశాలలో సమస్య కాని ఫ్లూ మీ దేశాలకు ఎందుకు అంత సమస్య గా మారిపోయింది ? వాతావరణం వల్లనా ? లేక మీ natural ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉండడం వల్లనా ? లేదా ఇంకేదైనా సమస్య ఉందా ?
2 . కరోనా, తొలి నుంచి ఒక్క దక్షిణాఫ్రికా దేశం మినహాయించి మిగతా ఆఫ్రికా దేశాలకు అసలు అసమస్యే కాలేదు . పెద్దగా చావులు లేవు . మీకు మాత్రం ఇప్పటి దాకా ఆరు వేవ్ లు . ఎందుకు ?
౩. ఇండియా లో మీలాగే కరోనా తొలివేవ్ వచ్చింది . . కానీ గత సంవత్సరం వింటర్ లో అదే ఆల్ఫా వైరస్ తో మీకు రెండో వేవ్ .. అది కూడా తొలి వేవ్ తో పోలిస్తే బాగా ఎక్కువ స్థాయిలో . అది కూడా అదే ఆల్ఫా వైరస్ తో . . ఇండియా లో వింటర్ లో వేవ్ రాలేదు . ఎందుకు ? ఒక్కో వైరస్ తో మీకు రెండేసి వేవ్ లు ఎందుకు వస్తున్నాయి ?
ఇంకా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ వెనకటి యుగం లో ఉంటే ఎలా ? మీ దేశానికి మీ ప్రజలకు జరిగితే అది సర్వమాన వాళికి జరిగిపోతుంది అనుకొంటే ఎలా ? మీ చాప కింద కు చైనా నీరు వచ్చింది . ముందు దాని సంగతి చూడండి . మీది మలినం . పక్క వాడికి కడగాలంటే ఎలా ?ముందు మీది కడుక్కోండి స్వామి . అప్పటిదాకా మీ రిపోర్ట్ ను మడిచి … ఫైల్ లో పెట్టుకోండి .
వాక్సిన్ వేసుకున్నా ఓమిక్రాన్ సోకుతుంది . – ప్రపంచ అనారోగ్య అద్దచుల వారు .
అన్నట్టు గురువు గారిగురించి మొన్న ఒక సరికొత్త సమాచారాన్ని సేకరించాను . కరోనా పుట్టింటి దేశం తో ఈయన గారి బంధం నేటిది కాదు . బాల్యం లోనే ఈయనకు ఇప్పుడు ఈయనను స్పాన్సర్ చేస్తున్న దేశం తో సంబంధాలు ఉండేవి . ఈయన పుట్టింది ఇథియోపియా దేశం లో . అక్కడ బాల్యం లోనే ఈయన కరోనా పుట్టింటి దేశానికి అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీ లో సభ్యుడు . ఇది చాల స్ట్రాంగ్ బంధం గురూ . అసలు ఈయనను ఈ స్థాయికి తెచ్చింది ఆ దేశమే . చూస్తుంటే కరోనా ప్లాన్ ఈ నాటిది కాదు . దీని కోసం లేదా ఏదో ఒక పండెమిక్ ను ప్రపంచానికి అటించడానికి ఎప్పటినుంచి ఆ దేశం ప్లాన్స్ సిద్ధం చేస్తోంది .
చైనా కు పోటీ అమెరికా . కొంత స్థాయిలో యూరోపియన్ దేశాలు . వారికీ ఆల్రెడీ వింటర్ లో ఫ్లూ బెడద ఉండేది . ఇప్పుడు దానికి తోడు కరోనా .. దాని కొత్త రూపాలు . ఇప్పటికే ఆరు వేవ్ లు .. అనేక లాక్ డౌన్ లు . ఇప్పుడు మళ్ళీ . ఇక మీదట బహుశా ప్రతి వింటర్ లో ఇదే తంతు కాబోలు . ఇక అమెరికా యూకే చైనా పోటీ పడేది ఎక్కడ ? సైన్యాన్ని బయటకు తీయలేదు . ఒక్క మందుగుండు ను ఉపయోగించలేదు . శత్రు దేశాల్ని సర్వ నాశనం చేసేసాడు . ఇక మిగిలింది ఇండియా . ఇండియా కోసం డెల్టా ను సిద్ధం చేసి వదిలాడు . ఇప్పడు ఓమిక్రాన్ పేరుతొ ప్రచార యుద్ధం . ఇంకో లాక్ డౌన్ పెట్టేస్తే ఇక్కడ అంత నాశనం . ప్రపంచం లో ఏకైక అగ్ర రాజ్యం గా దూసుకొని పోవచ్చు . వాహ్ .. ఏమి ప్లాన్ ? ఏమి ఎక్సిక్యూషన్ ?
మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టు కూడా గ్రహించని జన సామాన్యం . అన్నీ మూసుకొని , అంటే ఇంట్లో మాస్క్ వేసుకొని , కిటికీలు , తలుపులు మూసుకొని కూర్చోండి . లేక పొతే డేంజర్ . అన్నట్టు ఆల్ఫా సోకుతుందని కాయగూరలు శానిటైజర్ తో కడగడం , లిఫ్ట్ ను అగ్గిపుల్ల తో నొక్కడం చేసేవారు . ఇవన్నీ ఓమిక్రాన్ కు కూడా వర్తిస్తాయా ? లేక ఏదైనా కొత్త పద్ధతులు వచ్చాయా ?
☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️
ఆధునిక యుద్ధం తీరు వేరు. ఈ యుద్ధం లో నేను దేశం తరపున పోరాటం చేస్తున్న సైనికుడిని. మరి మీరు ?
Vasireddy Amarnath