ప్రేమ సినిమాలు ఎన్నైనా రాని. ప్రేమ‌లో యూత్ మునిగిపోని. అది కొంత‌కాలం వ‌ర‌కే. మ‌రి జీవిత భాగ‌స్వామిని ఎంచుకోవాలంటే.. సంపాద‌న కూడా చూడాలి క‌దా. పిల్ల‌గాడు ఏం చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు…? అనేవే అప్పుడు ప్ర‌యార్టీ అంశాలు. అందంగా ఉన్నాడు. కానీ ఏం చేయ‌డు. అంటే ఏ అమ్మాయైనా చేసుకుంటుందా..? ఊహూ.. నో ఛాన్స్‌.

ప్రేమ‌లో ప‌డితే వాడినే చేసుకోవాల‌ని లేదు. న‌చ్చ‌క‌పోతే ఇంకొక‌ర్ని చూసుకోవ‌చ్చు. కానీ ఒక్క‌సారి పెళ్లికి క‌మిట్ అయితే.. వాడితే వేగాలి. భ‌రించాలి. సంపాద‌న కూడా లేక‌పోతే.. ఉల్టా వాడు పెళ్లాం సంపాద‌న‌పైనే ఆధార‌ప‌డితే .. ఆ న‌ర‌కం అమ్మాయిల‌కు మామూలుగా ఉండ‌దు. అందుకే ప్రాక్టిక‌ల్‌గా ఆలోచిస్త‌న్నారు వాళ్లంతా. పెళ్లి చేసుకోవాలంటే క‌నీస అర్హ‌త ఒడ్డూ పొడుగు, అందం ఆక‌ర్ష‌ణ కాదు. ఏం చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు. లైఫ్‌లో సెటిల్ అవుతామా? భ‌విష్య‌త్తులో కన్న క‌ల‌లు నెర‌వేరుతాయా? అనేదే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్‌. ప్రేమ మైకంలో అప్పుడు ఆలోచ‌న ఉండ‌దు. కానీ పెళ్లి చేసుకునే ప‌రిస్థితి వ‌స్తే.. ఇదే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ. అమ్మాయిలు ఇదే చూస్తున్నారు. లోఫ‌ర్‌గాడిలా తిరిగే వాళ్ల‌ను వారు ఎందుకు లైక్ చేస్తారు. చ‌ద‌వు సంధ్యా, ప‌ని సంపాద‌న‌.. ఇవీ కావాల్సినవి.

ప్రేమించ‌డం వేరు.. పెళ్లి చేసుకోవ‌డం వేరు.
ప్రేమించినోడినే పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

పెళ్లి చేసుకోవాల‌నుకున్నోడు అందంగానే ఉండి తీరాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.

ఇదీ ఇప్ప‌టి ట్రెండ్‌..