నేను గెలవలేదంటే మీరే కారణం. మీకు క్రమశిక్షణ లేదు. మీరు మంచోళ్లైతే నాకీగతెందుకు పడుతుండే. మీరు మారండి.. మారాలి. మార్పు రావాలి. మీరు మరీ ఘోరం.. దారుణం మీ ప్రవర్తన.
ఇలా అస్తమాను తమ తప్పులెరగకుండా ప్రజలను తప్పుబట్టి.. సాకులు వెతుక్కుని.. తన లోపాలు సమర్థించుకునేటోడు అసలు నాయకుడే కాదు. వాడు రాజకీయాల్లో రాకుండా హాయిగా ఏదైన పని చేసుకుని బతుకొచ్చు. తను దేశాన్ని ఉద్దరించేందుకే పుట్టానని భ్రమపడి.. ఒక సూపిరియారిటీ కాంప్లెక్స్‌ను తనువు నిండా నింపుకుని.. తనను గెలిపించడం మీ బాధ్యత.. లేకపోతే మీ ఖర్మ .. చావండి అనే రేంజ్లో బిల్డప్‌లిచ్చే ఇలాంటి అపరిపక్వ, అజ్ఞాన, నాన్సెన్స్. బుద్ది లేని, సోయి లేని, కుహనా మేధావులు చాలా మందే ఉన్నారు. తెలంగాణలో కూడా. వారెప్పుడూ లాంగ్ రన్లో రాజకీయాల్లో ఉండరు. కనుమరుగై.. తెరమరుగై.. కనబడకుండా.. కనీసం పేరు కూడా ఉనికిలో లేకుండా.. కాలగర్భంలో కలిసిపోవడమే. ఇదే చరిత్ర. అది తెలుసుకోలేని చరిత్ర హీనులు చాలా మందే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో..