ఒమిక్రాన్ వేరియంట్ పుట్టిన దక్షిణ ఆఫ్రికాలో గత నెల రోజుల న ఉంచి ఈ వైరస్ సోకిన ఒక్కరు కూడా మరణించలేదు…. దీన్ని బట్టే తెలుస్తుంది.. ఇదంతా తీవ్రమైనది కాదని, దీని వల్ల మనకేమీ ప్రమాదం లేదని. అవును.. ఇప్పుడు వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఇలాంటి వాస్తవాలైన వార్తలు ఎంత మంది చెబుతున్నారు. మెడికల్ మాఫియాకు ఊతమిచ్చేలా , ప్రజలను మరింత భయాందోళనకు గురిచేసే ప్రచారమే సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. సంచలనాల కోసం దీనిపై ఎక్కువ చేసి వార్తలు రాస్తున్న మీడియా.. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులెదురవుతాయి..? సమాజం పై, ఆర్థిక వ్యవస్థ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆలోచనను విస్మరించింది. ప్రముఖ పరిశోధకులు, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో ఆంధ్రజ్యోతి తీసుకున్న ఇంటర్వ్యూలో చాలా వాస్తవాలు, కొత్త విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
– ఒమిక్రాన్ సోకితే కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదు. గత నెల రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఒక్కరు కూడా మరణించలేదు. దీన్ని బట్టే ఒమిక్రాన్ అంత తీవ్రమైన వైరస్ కాదని తేలిపోయింది. దీని వల్ల మనకెలాంటి ప్రమాదమూ లేదు.
– 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నాయి. మూడోవేవ్ పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందదు. గత ఏడాది 20 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలున్నాయి. అందుకే రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా పడింది.
– భారతీయుల్లో టీఎస్ఎస్ఆర్ ఎస్ అనే జన్యువు ఉంటుంది. ఈ జన్యువు మనలో శతాబ్దాల నుంచీ ఉండిపోయింది. ఈ జన్యువు వల్లే కోవిడ్ ప్రభావం తీవ్రత మన మీద చాలా తక్కువ. కాబట్టే ప్రపంచ వ్యాప్త మరణాలతో పోలిస్తే మన దేశంలో కోవిడ్ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. అమెరికాతో పోలిస్తే మనదేశంలో 30 శాతం తక్కువ.