ఆర్టీసీకి జలజీవాలు తెచ్చే పనికి ప్రభుత్వం పూనుకుంటున్నది. పాతవి, పనికి రాని బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాదాపు 600 బస్సుల వరకు ఇప్పటికే స్క్రాప్‌కు వెళ్లగా, మరో 500 బస్సుల కాల పరిమితి ముగియనుంది. నిర్ణీత కీలో మీటర్లు ఇవి తిరిగి ఉన్నాయి. దీంతో ఇవీ త్వరలో స్క్రాప్‌కు వెళ్లనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో సిటీ బస్సుల కొరత వేధిస్తున్నది.
వీటికి తోడు త్వరలో మరిన్ని బస్సులు మూలకు పడుతుండటంతోన్సీలకు అప్పటికొత్త బస్సుల అనివార్యత ఏర్పడింది. వెయ్యి నుంచి 1200 బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. టికెట్ల రేట్ల పెంపుపై సీఎం కేసీఆర్ త్వరలో ఆమోద ముద్ర వేయనున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానున్నది. ఆదేశాలు వెలువడనున్నాయి. నెలకు 60 కోట్ల మేర.. అంటే దాదాపు ఏడాది 700 కోట్ల ఆదాయం ఈ టికెట్ల రేట్ల పెంపు వల్ల ఆర్టీసికి సమకూరనుంది. ఈ ఆదాయాన్ని చూపి కొంత రుణం తీసుకుని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నది ప్రభుత్వం.
ఆదాయ మార్గలు పెంచుకునే ప్రణాళికలూ వేస్తున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బంకులు ఏర్పాటు చేసి టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించి ఆదాయం సమకూర్చకుంటున్నది. ఇప్పుడు ఈ బంకుల ఏర్పాటు ప్రక్రియను పెంచాలని చూస్తున్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఒకటో తేదీ..మొదటి వారంలోగా పడేలా చూస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేకుండె. మెల్లమెల్లగా ఆర్టీసీ కొత్త సంస్కరణలతో ముందుకు సాగేందుకు అడుగులు వేస్తున్నది.