నలుగురు పొయ్యే దారిల మనం పోతే మనకు విలువుండది.. అందుకే దేంట్లయినా పొక్కలు లెంకులాడుతరు.. కానీ అది ఏ సంధర్భం అని ఆలోచించుకోవాలే.. సిరివెన్నెల చనిపోయిండు అనేది వార్త.. అవసరమైతే నివాళి అర్పించాలే లేదంటే మూస్కొని కుసోవాలే.. ఆయన బతికున్నప్పుడు చెయ్యని చర్చ ఎవలో నాలుగు పోస్టులెయ్యంగనే ఒకలెనక ఒకలు మంచిగ తలిగిర్రు.. ఆల్ల భావజాలంతోని మనకొచ్చే నష్టమేముంది.. ప్రతి ఒక్కలికి ఒక్కో అభిప్రాయం ఉంటది.. కత్తి మహేష్ చనిపోయినప్పుడు కొంత మంది చర్చలు పెట్టిర్రు.. ఇప్పుడు ఆల్లే సిరివెన్నెల మీద చర్చలు చేస్తుర్రు..

ఎన్నో వందల అర్ధవంతమైన పాటలు రాసి ఒక్కసారి ఆరెస్సెస్ భావజాలాన్ని నెత్తికెక్కిచ్చుకున్నందుకు మరీ ఇంతలా పగపట్టాలా..? ప్రపంచంలో మీరు ఆచరించేదే గొప్ప భావజాలమా..? ఇక్కడ ఫెమినిస్టులు, హ్యూమనిస్టులు, స్త్రీ జనోద్ధారకులుగా చలామణీ అయ్యే చాలా మంది ఇండ్లల్లో ఆడవాళ్లని, పనోల్లను ఎలా చూస్తున్నరో చాలా మందికి తెలుసు.. ఫెమినిస్టుగా ఉంటూ ఇంట్లో ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నరని కూడా తెలుసు.. ఇట్ల ప్రతీదానికి బట్టలు చింపుకుంట పోతే కుట్టుకోవడానికి సుత సందు లేకుంట ఉంటది..

మనకు నచ్చిన కవే గొప్పోడు, మనకు నచ్చిన భావాజాలమే గొప్పది అనుకోవడం మంచిదే.. కానీ చనిపోయిన తర్వాత ఒక మచ్చని పట్టుకొని ఆయన జీవితాన్ని ప్రశ్నించడం మాత్రం కరెక్ట్ కాదు.. ఇప్పటికీ మనసు బాగాలేనప్పుడు పాటలు వినేటోల్లు చాలా మంది ఉన్నరు.. దాంట్ల సిరివెన్నెల పాటలు ఖచ్చితంగ ఉంటయి.. ఆ పాటలు వినమని ప్రోత్సహించినోల్లు సుతం ఇయ్యాల ఆయన పాటలు చెత్త అంటుంటే ఇక్కడ ఉండుడు ఇంకా దండుగ అనిపిస్తుంది..

ఇప్పటికీ నాకు పడుకునేముందు పాటల్లో గుర్తొచ్చే కొద్దిమంది రచయితల్లో సిరివెన్నెల తప్పకుంట ఉంటరు.. ఆయన భావజాలమేదైనా కానీ ఆయన రాతలు మాఫీ చేస్తనే ఉంటయి..

పి. ఎస్: ఇంకొక విషయం.. ఆయన ఆరెస్సెస్ ఆకర్షితుడు, మోడీ, షా లను నరనారాయణుడు అన్నాడని తెల్వదు.. మీ పోస్టులతోనే పబ్లిసిటీ ఇస్తూ ఆ భావజాలలను ఇంకా పైకి మోస్తున్నరు..

Akhilesh kasani

You missed