ఏపీ సీఎం జగన్ వైఖరి తెలుగు సినీ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నది. మొన్నటి వరకు కరోనాతో కోలుకోలేని దెబ్బ తిని ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు జగన్ మరో కరోనాల మారాడు వారికి. ఆన్‌లైన్ టికెట్ విధానం.. రేట్లు పెంచుకునే వెలుసుబాటు లేకుండా చేయడం.. బెనిఫిట్ షోల సంస్కృతికి చరమగీతం పాడటంతో పెద్ద బడ్జెట్ సినిమాలు తీయాలంటేనే నిర్మాతలు జంకే పరిస్థితి వచ్చింది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఇక తోకముడవాల్సిన దుస్థితి ఏర్పడింద. ఒక్కతెలంగాణలోనే డబ్బులు రావాలంటే రావు. ఆంధ్రలోనే ఎక్కువ లాభాలు సినిమాలకు. మరి అక్కడే దెబ్బ పడితే ..అందుకే విలవిలలాడుతున్నారు నిర్మాతలు.
తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌లోనే అంతో ఇంతో లాభాలు. ఆంధ్రలో వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్ లలో విపరీతమైన లాభాలు నిర్మాతలకు. కానీ ఇప్పుడా పరిస్థితి ఉండదు. దీంతో ఇప్పటి వరకు సినిమాల హిట్లతో ఏ రేంజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు… అగ్ర హీరోల సరసన చేరి కోట్లు గుంజుతున్న హీరోలకు ఇక కాలం చెల్లనుంది. కోట్ల నుంచి లక్షల్లోకి వారి రెమ్యూనరేషన్లు పడిపోనున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే గజ్జున వణుకుతారు నిర్మాతలు.
ఇప్పటి వరకు వెండితెరను ఏలిన దిల్‌రాజు లాంటి నిర్మాతలు కూడా ఇక చాలించుకుని, అరకొర సినమాలు తీస్తూ.. ఎప్పటికప్పుడు లాభాల జాతకాలను పరీక్షించుకుంటూ ఉండాలి. చిన్న సినిమాలకు మంచి స్కోప్ దొరకనుంది. తక్కువ పెట్టుబడితో ప్రయోగాలు చేసేందుకు కూడా దీన్ని అనువైన వాతావరణంగా వాడుకోవచ్చు. వృద్ధ హీరోల భారీ సెట్టింగులు,, భారీ బడ్జెట్‌లు ఉండవు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను ఇక్కడికి దిగుమతి చేసుకునే పరిస్థితీ ఉండదు. పాటల కోసం ఎక్కడికో దూరదేశాలకు పోయి.. చేతులు ఏతులకు పోయి చేతులు కాల్చుకునే సంస్కృతీ ఉండదు. తెలంగాణలోనే చాలా చోట్ల మంచి మంచి ప్లేసులున్నాయి. షూటింగ్/ల కోసం. ఇకనైనా వాటిని వినియోగించుకుంటారేమో చూడాలి.