‘ మహానాయకుడు ‘ కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు ..
ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ గారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టి ఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి కేసీఆర్ ..ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ అభివృద్ధి , సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్ గారు.. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో , ప్రజల ఇంటి పార్టీ గా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో సారి టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గౌ.శ్రీ కేసీఆర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు..
జై తెలంగాణ.. జై కేసీఆర్
#20YearsOfTRS
ఇదీ హుజురాబాద్ నుంచి హరీశ్ రావు సందేశం. ఎంత భాదపడుతూ దీన్ని పంపాడో కదా. పగవాడికి కూడా రావొద్దీ కష్టాలు. ట్రబుల్ షూటర్‌గా ముద్రపడటమే తనకు పాపంగా.. కాదు.. శాపంగా మారినట్టుంది. హుజూరాబాద్‌లో పార్టీని గట్టెక్కించాలె. అందుకే ప్లీనరీకి పోలేదు. అవునూ.. తెల్వక అడుగుతా.. ఈ ఒక్కరోజు హుజురాబాద్‌లో లేకపోతే పార్టీ గెలుపోటములు ఏమన్నా తారుమారువుతాయనే హరీశన్నా..! నువ్వూ.. నీ భయం.. నీ చాదస్తం గానీ. మనోళ్లందరూ పండుగ లెక్క ఆడ ఒక్కదగ్గర కలుసుకున్నరు. గిసొంటి సమయంలో నువ్వు లేకపోతే ఆడ ఎట్లనో ఉందే. అయినా.. నిన్ను పెద్ద సారు యాది చేసిండే.. హుజురాబాద్ల హరీశ్ బాగా కష్టపడుతుండు.. అందుకే రాలేదన్నడు. నీ కష్టం వృథా పోదన్నా… తప్పకుండా నువ్వు హుజురాబాద్ల గెలుస్తవు.. అదే.. అదే గెల్లు గెలుస్తడు..