బొమ్మరిల్లు సినిమా ఆల్‌టైమ్ రికార్డ్. డైరెక్టర్ భాస్కర్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా. సత్తా ఉన్నోడు అని నిరూపించిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తండ్రి .. కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దేదుందుకు పడే తపన.. ఆ తండ్రి చూపే అత్యత్సాహపు పోకడలు ఆ కొడుకు నచ్చవు. భరిస్తాడు. తండ్రి కోసం. ఓ అమ్మాయి హాసిని కలుస్తుంది. ఆమెలోని అమాయకత్వం ఎంతో నచ్చుతుంది హీరోకు. ఆ హీరోయిన్‌ను దక్కించుకునేందుకు ఎన్ని తంటాలు పడుతాడు? ఫ్యామిలీని ఎంత బాధపెడతాడు. తనెంతో బాధపడతాడు. చివరకు తన మనసులో ఆవేదనను నాన్నతో ఎలా వెలిబుచ్చుతాడు…? ఈ కథంగా ఆసాంతం కట్టిపడేస్తుంది. చిన్నాపెద్దా అంతరికీ నచ్చింది. పాటలు బాగున్నాయి. అంతర్లీనంగా కామెడీ నచ్చింది. డైరెక్టర్ టేకింగ్ సూపర్. డైలాగులు అదిరాయి. చెప్పే విధనంగా నచ్చింది.
కానీ ఆ తర్వాత డైరెక్టర్ తీసిన ఆరేంజ్ తన్నేసింది. భారీ బడ్జెట్. ఏదో ఇలాగే ప్రేమ, పెళ్లి అనే పిచ్చి కథ రాసుకుని ..తిప్పి తిప్పి ప్రేక్షకుల నెత్తినొప్పిని తెచ్చిపెట్టి.. జండుబామ్‌తో సినిమాలకు వెళ్లే విధంగా చేశారు. అదే తరహాలో ఒంగోలు గిత్త అట్టర్ ఫ్లాప్. చాలా రోజుల తర్వాత మళ్లీ బొమ్మరిల్లు కాన్సెప్ట్‌నే నమ్ముకున్నాడు భాస్కర్. ఫెయిల్యూర్ హీరో అఖిల్‌ను ఎంచుకున్నాడు. అఖిల్ అసలు ఈ కథకు కనెక్టే కాలేదు.
అమెరికాలో ఉద్యోగం చేసేటోడ ఏకంగా 20 పెళ్లి చూపులుచూసి ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసుకుందామని అనుకోని రావడం బ్లండర్. పాత చింతకాయ పచ్చడి కన్నా… ఇంకా బూజు పట్టిన పచ్చడి లాంటి కా మళ్లీన్సెప్ట్. ఇందులో జాతకాలు కలవలేదేని హీరోయిన్ సంబంధాన్ని తిరస్కరించడం. అబ్బబ్బ.. పెళ్లి చూపుల ఎపిసోడ్‌లైతే మరీ బోరెత్తించాయి. అంటే హీరోకు ఒక టేస్ట్ లేదు. ఒక ప్రేమ లేదు. మరీ అంత చీఫ్‌గా చూపించేశాడు డైరెక్టర్. హీరోయినే ఇందులో అసలైన హీరో అసలు. ఆమెను చూసే ఇన్స్పైర్ అవుతాడు హీరో. లైఫ్ అంటే రోమాన్స్, సెక్స్ అనే అర్థం వచ్చేలా చెప్తుంది హీరోయిన్. ఇదీ కొత్త కాన్సెప్ట్. డైరెక్టర్ కొంత సాహసమే చేశాడని చెప్పాలి.
కానీ ఆ ఫార్మూలా ఎంత మందికి నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అయితే కాదు ఇది. అఖిల్ కన్నా.. నాగచైతన్య ఎంచుకున్న కథలు కాస్త బెటర్. ప్రేమలో, వైవాహిక జీవితాల్లో ఫెయిలయిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంచుకున్న కథలు కూడా అదే స్థాయిలో ఫెయిల్ అయి కూర్చుంటున్నాయి. ఇక వీరు లేచేదెప్పుడే. లేచి నిలబడి తమ సత్తాచూపే దెప్పుడో..??