ఉప్పు సంతోష్, తీన్మార్ మల్లన్న ఇద్దరూ బంధువులు. ఉప్పు సంతోష్ ఇందూరులో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే వారి లిస్టు సేకరిస్తాడు. ఆ విషయాన్ని తీన్మార్ మల్లన్నకు ఉప్పందిస్తాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి సదరు వ్యాపారికి ఫోన్ చేస్తారు.అడిగిన డబ్బులిస్తవా..? లేదంటే క్యూ న్యూస్‌లో నీ కథనాలు ప్రసారం చేయాలా..? అని బెదిరిస్తారు. అడిగింది తీసుకుని ఉడాయిస్తారు. మొన్న ఎడపల్లిలో ఓ కల్లు ముస్తాదారును బెదిరించి 20 లక్షలు డిమాండ్ చేశారు వీరిద్దరు. 5 లక్షలు ముట్టచెప్పిన జయవర్దన్ గౌడ్ .. తన వద్ద ఇంతకన్నా లేదని కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా వినలేదు. దీంతో పోలీసు కేసు పెట్టారు. ఇది మరవక ముందే మరో కేసు బయటకు వచ్చింది.
మాచారెడ్డికి చెందిన బాలరాజ్ గౌడ్ ఇసుక వ్యాపారి. ఇతని వద్ద 20 లక్షలు డిమాండ్ చేశాడు ఉప్పు సంతోష్. ఆ డబ్బులు తీసుకున్నాడు. తీన్మార్ మల్లన్నను పిలిపించి తన ఇంట్లోనే వ్యాపారితో బేరం మాట్లాడుకున్నాడు. తనకో 5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడంట. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాలరాజ్ గౌడ్ జంకాడు. తననేమన్నా చేస్తారేమోనని భయపడ్డాడు. ఎడపల్లి కేసు తర్వాత ధైర్యం తెచ్చుకుని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిన్న ఉప్పు సంతోష్‌ను రిమాండ్‌కు పంపారు. తీన్మార్ మల్లన్న పై పీటీ వారెంట్ జారీ చేశారు. ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలియదు.