డిగ్రీలు చదివినా లాభం లేదు. ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఇగో నాలుగు బర్రెలు కొని మేపుతున్నా.. పొద్దున ఐదు లీటర్లు.. సాయత్రం ఐదు లీటర్ల పాలిస్తున్నాయి. రోజుకు మూడునాలుగొందలు సంపాదిస్తున్నా.. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఓ అమ్మాయి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి నిజంగానే జాబ్ లేక చేసిందా? టిక్‌టాక్‌తో మజాక్ చేసిందా.. ? తెలియదు. కొందరు సీనియస్‌గా తీసుకున్నారు షరా మామూలుగా. కొందరు ఈ వీడియో వెనుక కథేందీ అని ఆరా తీశారు.
మొత్తానికి ఏతావాతా తేలిన విషయం ఏంటంటే.. ఆ అమ్మాయికి సరదాగా టిక్‌టాక్‌లు చేయడం అలవాటని. ఆ అమ్మాయి చేసిన అన్ని టిక్‌టాక్‌లను వెతికి వెతికి మరీ పట్టుకున్నారు టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్… అమ్మా… బర్రెపిల్ల అమ్మాయి.. మా గవర్నమెంటునే బద్నాం చేస్తవా…? ఇగో చూడు నీ బండారం బయటపెడతం.. అని ఆడుకోవడం షురూ చేశారు. ఆమె టైంపాస్‌కు చేసిన టిక్ టాక్ వీడియోలన్నీ పెట్టి.. నీకు ఏ ఉద్యోగం కావాలమ్మాయి..? అని వెటకారంగా అడుగుతూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఆ అమ్మాయి పేరేందో గానీ, అప్పుడు బర్రెలతో ఫేమస్ అయ్యింది.. ఇప్పుడు టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్‌తో ఇంకా ఫేమస్ అవుతున్నది. అదీ సంగతి..
అవునూ…! టిక్ టాక్‌లు హాబీగా ఉంటే మాత్రం.. డిగ్రీ చదవలేదంటారా? ఒక వేళ డిగ్రీ చదివినా.. సీరియస్‌గా ఉద్యోగానికి ట్రై చేయలేదంటారా? అసలు ట్రై చేసేందుకు నోటిఫికేషన్ ఎక్కడున్నాయ్..? అని అంటారా? లేదా టిక్‌టాక్ చేసేందుకే టైం లేదు.. ఇంకా జాబ్ ప్రిపేర్‌కు టైం ఎక్కడుందని అంటారా??
ఏదీ కరెక్టు..? ఏది అబద్దం..??
బర్రెలు కరెక్టు… టిక్‌టాక్ లూ కరెక్టూ… నోటిఫికేషన్లే అబద్దం..