అన్నింటికీ చ‌దువే ముఖ్య‌మా? చ‌దివీ, చ‌ద‌వీ డిగ్రీలు సంపాదిస్తే.. ఇక లోకంలో హాయిగా బ‌తికేయొచ్చా..? అదంతా ఈజీ కాదు నాయ‌న‌. చ‌ద‌వు థియ‌రీయే.. లోకం పోక‌డ ప‌ట్టుకోక‌పోతే ప్రాక్టిక‌ల్ లైఫ్ ఉండ‌దు. తెలివి తేట‌లు ప్ర‌ద‌ర్శించ‌కపోతే మ‌నుగ‌డ క‌ష్టం. స‌మ‌య‌స్పూర్తి బ‌య‌ట‌కురాక‌పోతే.. లోలోప‌లే మ‌నం. నాలుగ్గోడ‌ల‌కే ప‌రిమితం.

చ‌దువు.. చ‌దువు.. ఎప్పుడూ చ‌దువుతూనే ఉండండి.. లోకం గురించి ప‌ట్టించుకోకండి. మ‌నుషుల‌ను చ‌ద‌వ‌కండి. పేజీల‌నే చ‌ద‌వండి. పుస్త‌కాలను చింపేయండి. బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకోండి. ఇవేమీ చేసినా.. ఇవ‌న్నీ జీవితాన్ని నేర్ప‌వు. జీవించ‌డాన్ని చూప‌వు. అందుకే అలా అప్పుడ‌ప్పుడు లోకాన్ని కూడా చూడండి. మ‌నుషుల‌ను కూడా చ‌ద‌వండి. లోక‌జ్ఞానం కూడా చ‌దువులాంటిదే దాన్నీ ఓ చూపు చూడండి. అప్పుడే లోకంలో మ‌నం ఎలా బ‌త‌కాలో తెలుస్తుంది. మ‌నుషుల పోక‌డ తెలుస్తుంది. బ‌తుకు నిర్వ‌చనం బోధ‌ప‌డుతుంది.

చ‌ద‌వురాని వాడ‌వ‌ని దిగులు చెంద‌కు… చ‌దువులో మొద్దుసుద్ద అని వాడ్ని తీసిపాడేయ‌కండి. ఇంకేదో.. మరేదో టాలెంట్ ఉండే ఉంటుంది. అది చూడండి. సాన‌బెట్టండి. దూసుకుపోత‌డు.

You missed