వ‌రి వేయొద్ద‌ని ప్ర‌భుత్వం రైతుల‌కు అవగాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసింది. గ‌త వారం రోజులుగా క్ల‌స్ట‌ర్ల వారీగా రైతు వేదిక‌ల్లో ఈ మీటింగుల‌ను ఏర్పాటు చేశారు. సైంటిస్టులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, హార్టిక‌ల్చ‌ర్ అధికారులు .. అంతా క‌లిసి మీటింగులు పెట్టి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్త‌న్నారు. వ‌రిని కేంద్రం ప్ర‌భుత్వం కొన‌డం లేదు కాబ‌ట్టి.. ఆల్ట‌ర్‌నేట్ పంట‌ల‌కు పోవాల‌ని సూచిస్తున్నారు. కానీ రైతులు అధికారులు చెప్పిన దానికి ఏకీభ‌వించ‌డం లేదు.

వ‌రి వేయం.. కానీ వేరే పంట‌ల‌కు ఎవ‌రు హామీ ఇస్తారు. ప్ర‌భుత్వం గిట్టుబాటు ధ‌ర ఇస్తాన‌ని చెప్తుందా? అని ప్రశ్న‌లు వేస్తున్నారు. వీటిని అధికారుల నుంచి స‌మాధానాల్లేవు. చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి. రైతులు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రినే న‌మ్ముకున్నాడు. వ్య‌వ‌స్ఖ అంతా దాని చుట్టే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న‌ప‌ళంగా యాసంగిలో మొత్తం వ‌రి వేయ‌కుండా ఇత‌ర పంట‌లు వేయాల‌ని సూచించ‌డంతో రైతులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అధికారుల‌ను నిల‌దీస్తున్నారు. దొరికింది క‌దా సాకు అని సీఎం కూడా వ‌రి వేస్తే ఉరే అన్న‌ట్టు మాట్టాడ‌టాన్ని కూడా వారు త‌ప్పుబ‌డుతున్నారు.

వ‌రి వేయ‌కుండా వేరే పంట‌లు ఏవి వేస్తే బాగుంటాయో చెప్తున్నారు.. బాగానే ఉంది. మేము వేయ‌డానికి సిద్ధం. మొక్క‌జొన్న‌కు మ‌ద్ద‌తు ఇస్తారా. స‌న్‌ఫ్ల‌వ‌ర్‌,పల్లీలు, శ‌న‌గ‌లు.. ఆరుత‌డి పంట‌లు కూడా వేస్తాం. వీటికి భ‌రోసా ఏందీ? ప్ర‌భుత్వం నుంచి బోన‌స్‌, ప్రోత్సాహ‌కాలుంటాయా? అని అధికారుల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. సాగునీటి ల‌భ్య‌త బాగున్న చోట వ‌రి కాకుండా వేరే పంట‌లు ఎలా వేయాలి..అని కూడా అడుగుతున్నారు. పుష్క‌లంగా సౌక‌ర్యం ఉన్న‌ప్పుడు, చెరువు కింద‌, వాగుల కింద వ‌రి వేయ‌క‌పోతే ఏం వేయాలని ఉల్టా ప్ర‌శ్న‌లు వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

You missed