ఎప్పుడో 83లో కురిశాయంట ఇలాంటి వానలు. మళ్లీ ఇప్పుడు. దాదాపు 24 సెం. మీ పైనే వర్షపాతం నమోదైంది చాలా చోట్ల. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వరి, సోయాబీన్, మొక్కజొన్న, పపుసు… అన్ని పంటలకూ నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పక్కన ఉన్న పంటలు ఇంకా నీళ్లలోనే మునిగి ఉన్నాయి. మరో రెండ్రోజులైతే తప్ప నష్టాన్ని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. వ్యవసాయాధికారులు ప్రాథమిక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ఇది ఫైనల్ కాదు. మరో రెండు మూడు రోజుల తర్వాత తుది నివేదక అందిస్తారు. 33 శాతానికిపైగా నష్టపోయిన పంటలకు పరిహారం కింద అర్హత వస్తుంది. దాదాపు అన్ని పంటలకు పరిహారం ఇవ్వాల్సిందే. అలాంటి డ్యామేజీ జరిగింది. రోడ్లు, వంతెనలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ చాలా చోట్ల ఆగిపోయింది. మన ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికలపై పెట్టిన శ్రద్ధ ఈ పంటనష్టం , రైతుల గోసపై పెడితే బాగుంటుంది.
