నిజామాబాద్ నగర నడిబొడ్డున నలుగురి చేత దారుణంగా సామూహికంగా రేప్‌కు గురైన బాధితురాలికి ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. ఈ దారుణ సంఘటన వెలుగు చూసిన మరుక్షణం నుంచి ఆమె పోలీసులకు టచ్‌లో ఉన్నారు. పరిస్థితుల పై ఆరా తీస్తూ వస్తున్నారు. నిందితులు దొరికే వరకు బాధితురాలికి సత్వర చికిత్స అందే వరకు ఆమె పోలీసులతో నిరంతరంగా సమీక్షిస్తూనే ఉన్నారు. ఈ రోజు తన ఫేస్‌బుక్ వాల్ పై ఈ దారుణ ఘటన పై స్పందన తెలియజేస్తూ కామెంట్ పెట్టారు.
బాధితురాలికి వ్యక్తి గతంగా, అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలను సహించదని, ఉపేక్షించదని, కఠినచర్యలు తీసుకుని నిందితులను శిక్షిస్తుందని తెలిపారు. షీ టీమ్‌ల ఏర్పాటు ద్వారా నిరంతరం ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రేప్ ఘటనలో నిందితులను త్వరగా కేసును చేధించిన పోలీసులను కవిత అభినందించారు.