కరోనా మొదటి వేవ్‌లో దొరికిన ఖాళీ సమయంలో నేను రాసిన తొలి నవల ‘రిపోర్టర్ రాజారెడ్డి’. కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు పత్రిక రంగం కుడా అతలాకుతలమైంది. ఉద్యోగాలు పీకేసారు. చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యాన్ని తీసుకుని ఓ విలేఖరి ఎదుర్కొన్న అనుభావాలు, చేదు సంఘటనలు, కుటుంబ పరిస్థితుల నేపథ్యం తదితర అంశాలను అందులో టచ్ చేశా.

సస్పెన్స్ కూడా జోడిస్తూ.. రాజారెడ్డి వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కున్నాడు? విపరీతమైన ఒత్తిడికి లోనయై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. చివరికి రాజారెడ్డి జీవితం ఎలా ముగిసింది.. ? అనే అంశాలు ఇతివృత్తంగా తీసుకుని ఈ నవల రాశాను. రేపటి నుంచి ధారవాహికంగా ‘వాస్తవం’ వెబ్‌సైట్‌లో పాఠకుల కోసం అందిస్తున్నాం. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

రచయిత
దండుగుల శ్రీనివాస్
8096677451

You missed