ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారని రెండు రోజుల క్రితం KTR ట్వీట్ పెట్టిండు. నిందితుడు రాజు ఇప్పటికీ దొరకలేదని, పట్టిస్తే పదిలక్షల బహుమానం అని, ఇప్పుడు పోలీసుశాఖ చెబుతోంది.
ఇదంతా చూస్తూ ఉంటే, అతని డెడ్ బాడీని చూపించి, పోలీసుల మీద దాడిచేయబోతుంటే ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేసి చంపేసామ్ అని చెప్పడానికి గీసిన ప్లాట్ లానే ఉంది.
మెజారిటీ ప్రజలు ఆశించేది చేసి మెప్పుపొందాలని ప్రభుత్వం ఇలా చేయొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు ఆశించేది తప్పు. ఇప్పుడు ఎంకౌంటర్ చేయకపోయినా, ఈ నేరానికి POCSO ACT ప్రకారం మరణ శిక్షే పడుతుంది. విచారణ జరిపితే, విచారణ జరుగుతున్నంత సేపూ లైంగిక నేరాలపై చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా ఏం యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.
అదే ఎన్కౌంటర్ చేసి అతన్ని చంపేస్తే, ఈ సంఘటన వల్ల రేగబోయే అలజడిపై, చర్చలపై నీరు చల్లేసినట్టు అవుతుంది. జనాలు ఈ ఇష్యూని మరచిపోయి, రొటీన్ లైఫ్ లో మునిగివుతారు. అది ప్రభుత్వానికి లాభమే కానీ ప్రజలకు నష్టం.
దాని బదులు, విచారణ జరిపి శిక్ష వేసేలాగే డిమాండ్ చెయ్యండి. విచారణ జరిగినన్నాళ్ళూ ప్రభుత్వాన్ని నిలదీయండి. పిల్లలపై జరిగే చిన్న చిన్న క్రైమ్స్ కి కూడా POCSO ACT పై అరెస్ట్ చేసి, శిక్షలు వేసేలా డిమాండ్ చెయ్యండి. ఎక్కువ మంది చిన్న నేరాలకే శిక్ష అనుభవిస్తే, భయం పెరుగుతుంది. పెద్ద నేరాలు తగ్గుతాయి. అలాగే ప్రతీ స్కూల్లో పిల్లలకు, పేరెంట్స్ కు కలిపి good touch , bad touch పై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చెయ్యండి. అప్పుడే నేరాలు తగ్గుతాయి.
Rajeshwer chelimela