నిత్యం రణగొణ ధ్వనుల నడుమ యాంత్రిక జీవితం కొనసాగించే నగర జీవికి కొంత ఉపశమనం. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ ఆటవిడుపు. పిల్ల పాపలతో కాసేపు కాలక్షేపానికి అదో కేరాఫ్ అడ్రస్. ఆ వేదిక హైదరాబాద్ ట్యాంక్ బండ్. మొన్నటి వరకు ఇది ట్రాఫిక్ గడబిడల మధ్య బిజీబిజీగా, గత్తరబిత్తరగా ఉన్న ప్రాంతం. కానీ ఈ రోజు అదో సుందర పర్యాటక ప్రాంతం. మరో ప్రపంచం. మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ పరిసరాల పై దృష్టి కేంద్రీకరించారు.
ప్రతి ఆదివారం సందర్శకులకు ఇక్కడ అవకాశం కల్పించాడు. మరో ప్రపంచంలో కాసేపు సేదతీరి, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ఫేస్‌బుక్ వాల్ పై కేటీఆర్ షేర్ చేసుకున్న ఈ వీడియో ఎంతో మందికి వీనులవిందు కలిగిస్తున్నది.