బుల్లెట్ బండి సాంగ్ వైరలై ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నది. అందరినీ ఆకట్టుకున్నది ఈ పాట. సాయి శ్రీయ డ్యాన్సుతో మరింత మందికి చేరువైంది. ఇప్పుడు చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ పాటను పాడుతున్నారు. సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించాడు. ముత్యాల రఘుపతి అనే వ్యక్తి దీనిపై పేరడి సాంగ్ రాశాడు. ‘సర్కారు బడికే వెళుతున్నా.. వెళ్లుతున్నుల్లో వెల్లుతున్నా ‘ అని ప్రభుత్వ పాఠశాల పరపతిని పెంచే విధంగా పాట రాశాడు. నిఖిల మంచాల గానం చేసింది. పేద విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.