ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగం గురించి వేట ముమ్మరమయ్యింది. స్పాట్ పెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. కొద్ది సేపట్లోనే.. మరికొద్ది గంటల్లోనే వాడు శవమై తేలనున్నాడా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తున్నది. సిటీ పోలీసులు విడుదల చేసిన పదిలక్షల రివార్డు ప్రకటన కొత్త అనుమానాలకు తెరతీసింది. వాడి చావును ఎప్పుడెప్పుడు వింటామా? ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్న జనానికి పోలీసు రివార్డు ప్రకటన .. కొంచెం ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత విషయాన్ని అంచనా వేసుకోగలిగారు. ఇక మూడింది వాడికి అని నిర్దారణకు వచ్చారు. సోషల్ మీడియా నిండా ఇవే అభిప్రాయాలు. ఎన్కౌంటర్ ఆకాంక్షలే. పనిలో పనిగా సీపీ సజ్జనార్‌ను యాదికితెచ్చుకున్నారు.