హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ అయిన క్ష‌ణం నుంచి ..క్ష‌ణ క్ష‌ణం మ‌న‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు, కొంగొత్త విష‌య‌లు చెబుతూ.. మ‌న ఊపిరి ఆగిపోకుండా కాపాడింది టీవీ9. లేదంటే.. అక్క‌డేం జ‌రుగుతుంది? హీరో ఎలా ఉన్నాడు? చ‌స్తాడా..? బ‌తుకుతాడా? అస‌లు బ‌తికే ఛాన్స్ ఉందా? ఛ‌స్తే ఎలా? అస‌లు యాక్సిడెంట్ ఎలా జ‌రిగింది? కార‌ణం ఏంది?

ఆ బైక్ పాడుగాను.. ఎంత ప‌నిచేసింది. అవునూ.. అస‌లు ఆబైక్ ఎక్క‌డిది? ఏ కంపెనీది? ఎలా త‌యారు చేశారు. దానిపై అంత స్పీడు పోవ‌చ్చా?

అస‌లు ఇసుక‌తోనే ఈ ప్ర‌మాద‌మా? ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగి ఉంటుంది? జారి ప‌డిపోయిన సాయి.. ఎంత దూరం వ‌ర‌కు రోడ్డుపై రాక్కుంటూ వెళ్లాడు? ఎన్ని ప‌ల్టీలు కొట్టాడు?

అబ్బ‌బ్బ ఎన్ని ప్ర‌శ్న‌లు.. ఎన్నెన్ని అనుమానాలు… ఎంత టెన్ష‌న్‌.. న‌రాలు తెగే ఉత్కంఠ‌… ఊపిరి ఆగిపోతుందేమోననే స‌స్పెన్స్‌…

ఇవ‌న్నీ తీర్చింది … కాపాడింది.. ఒక్క టీవీ9 మాత్ర‌మే. అదే లేక‌పోతే.. ఎవ‌రో సీఎం చ‌స్తే పిట్టల్లా రాలిపోయిన జ‌నం లెక్క‌… మ‌నం కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ఏం జ‌రిగిందో తెలియ‌క గుండాగి చ‌చ్చే వాళ్ల‌మే.

థ్యాంక్స్ టీవీ9

You missed