మీడియాకు ఎలాంటి దుస్థితి పట్టింది. ఒకప్పుడు మీడియా అంటే ప్రజలకు మర్యాద, గౌరవం. ఇప్పుడు జుగుప్సా, ఏవగింపు. నానాటికీ దిగజారుతున్న వాటి పోకడలు చూసి జనం విసిగెత్తిపోయారు. ఛీ కొడుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియా ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత మీడియా వేషాలు సాగడం లేదు. బండారం బట్టబయలైతున్నది. మీడియా ముసుగులో వారిచ్చే ప్రయార్టీలు ప్రజాప్రయోజనాలకేనా..? కాదా? అనేది తేల్చుకుంటున్నారు. నిజాలు తెలుసుకుని కడిగిపారేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఈరోజు మీడియా దోషిగా నిలబడింది. దీనికి కారణం ఎవరు? ఎందుకిలా??