మైనర్‌పై ఘోరం గురించి ఎందుకు టీవీల్లోచర్చించలేదో… మన మూర్తి జర్నలిస్టు ఓ పెద్ద వివరణ ఇచ్చాడు. అందరితో తిట్టు తిన్నాడు. తనెంతో మేథావో తెలియజెప్పాడు సమాజానికి మరోమారు. పదే పదే చర్చ చేయడం వల్ల ఆ చిన్నారి కుటుంబంపై అనేక రెట్లు తీవ్రమైన మానసిక ఆందోళన కలిగిస్తుందట. సమాజంలో కొంత మందిలో ఇలాంటి పశు ప్రవృత్తితో కూడిన ఆలోచనలు అప్పుడప్పుడు రేకెత్తినా.. తను మాత్రమే ఇంత నీచాతి నీచంగా ఆలోచిస్తు భయంతో తనను తానే సంస్కరించుకుంటాడట. అబ్బా .. ఏం చెప్పావు.. మూర్తి…! నీవు మాత్రం ఆర్జీవీని స్టూడియోకి పిలిపించి..ఫోర్న్ గురించి.. సెక్స్ గురించి ఎంచక్కా ప్రశ్నలడుగుతూ.. సమాధానాలు వింటూ.. పైశాచికానందం పొందుతూ… రేటింగులు పెంచుకుంటూ అలా గడుపుతావన్నమాట. ఇలాంటి సమయాల్లో ఇలాంటి నీతులు చెబుతావన్నమాట. నిజంగా నువ్వు గ్రేట్ మూర్తి.. మూర్తి చెప్పిన వివరణ పై నెటిజన్లు భగ్గుమన్నారు. ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు.
ఎవరేమనుకుంటే నాకేం.. నీనింతే.. ఇప్పుడేమంటారు?