గణేశ్ చవితి సందర్భంగా ఆంధ్రలో ఏర్పాటు చేసిన ఓ గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నది. కాదు కాదు.. ఆశ్చర్యపరుస్తున్నది. ఔరా అని ముక్కుమీద వేలేసుకునేలా చేస్తున్నది. జగనన్న బియ్యం పథకాన్ని ప్రొజెక్ట్ చేస్తూ గణపతే స్వయంగా బియ్యం పోస్తున్నట్లు తీర్చిదిద్దారు. ఆ గణపతికి బియ్యం పథకానికి సంబంధించిన టీషర్ట్‌ను కూడా తొడిగారు. బహుశా దీన్నే అంటారు కాబోలు ప్రచారం పీక్స్‌కు వెళ్లిందని. పండుగ ఏదైతే ఏముంది పార్టీ రంగు పులమడమే ఇప్పటి ప్రచార శైలి. పండుగలకు కూడా ఇలా ‘రంగు పడుద్ధి’ అని నేతలు అర్ధాలనే మార్చేస్తున్నారన్నమాట.
