మన దేశపు రహదారుల స్టాండర్డ్ కి, ఇక్కడ తిరుగుతున్న ఇంపోర్టెడ్ బైక్ ల స్టామినాకు సంబంధమే ఉండటం లేదు.
డబ్బులుంటే చాలు ఏదయినా కొనేసుకోవచ్చు ,ఎక్కడైనా
తిరగొచ్చు అనే మైండ్ సెట్ తోనే బాగా డబ్బున్న జనాలు ఉంటున్నారు.ప్రభుత్వాలకు,అధికారులకు వారిని కట్టడి చేయాలనే దృక్పధం ఎటూ లేనట్టుగా ఉంది.కనీసం పబ్లిక్ అయినా ఇంపోర్టెడ్ బైక్ ల మీద రేష్ గా వెళ్ళేవాడిని కళ్ళు
అప్పగించి చూడకుండా,వాడిని ఆపి రెండు లెంపకాయలు
పీకుతుంటే తప్ప ఈ రోడ్ మన అందరిదీ అనే సంస్కృతి జనాలకు అలవడదు.ఇది నిన్న ఓ సినీనటుడికి జరిగిన
ప్రమాదం నేపథ్యంలోనే వ్రాస్తున్నా,ఈ విషసంస్కృతి చిన్న
చిన్న పట్టణాలు,గ్రామాల్లోను కూడా పెరిగిపోతుండడంతో కలుగుతున్న ఇబ్బందిని దృష్త్తిలో పెట్టుకునే చెబుతున్నా. జనాలందరికీ అపోలో వంటి ఆసుపత్రులు,చరకుడి లాంటి వైద్యులు అందుబాటులో వుండరు గుర్తుంచుకోండి, తేజ్ క్షేమంగా బయటపడాలని కోరుకుంటూ…..
Raghu Srimanthula