మీడియా మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నది. ఒక్కో పత్రిక ఒక్కో పార్టీకి బాకా ఊదాలి. ఒక్కో చానల్ తమకో పార్టీ అండ వెతుక్కోవాలె. అంతేగానీ నిఖార్సయిన, నిజాయితీతో కూడిన వార్తలు రాయడమనేది మీడియా ఎప్పుడో మరిచిపోయింది. ఇప్పుడు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాపై ప్రజలను నమ్మకం లేదు. అంతో ఇంతో వాస్తవాలను తెలుసుకునేందుకు సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. అంతటా దిగజారాయి మన తెలుగు పత్రికలు, చానళ్లు. తాజాగా ఆలెక్సా ర్యాంకింగ్ ఆఫ్ మీడియా వెబ్‌సైట్స్ – సెప్టెంబర్-21 ప్రకారం మొన్న మొన్న వచ్చిన వెబ్ న్యూస్ పేపర్ దిశ.. నమస్తే తెలంగాణను దాటి ముందుకు పోయింది. కొత్త ఎడిటర్ .. వచ్చి ఏదో చేస్తానని, పత్రికను ఎక్కడికో తీసుకుపోతానని కేసీఆర్ వద్ద శపథం పూనాడు. పత్రికను ఏమీ చేయలేకపోయాడు కానీ.. ఉద్యోగుల జీవితాలను మాత్రం రోడ్డుపాలు చేశాడు. దిశ పత్రిక.. నమస్తేను దాటి ముందుకు పోయింది ర్యాంకింగ్‌లో. చెప్పిందే చెప్పి.. పాడిందే పాడి… బలవంతంగా పాఠకులకు అవే పాచివార్తలను వండివార్చి పెట్టాలని చూస్తే.. పాఠకాదారణ ఇలాగే ఉంటుంది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి.. పర్వాలేదనే ర్యాంకులను తెచ్చుకున్నాయి.