“సాల‌రీ ప‌డ్డ‌దారా?”

“ఈ నెలైతే తొంద‌ర‌గ‌నే ఏసిండ్రురా నాయ‌న‌.. మొన్నటి దాకా జీతాలు ఎప్పుడేస్త‌రా? అని ఎదురుచూసినం.”

“అంటే ఇక నుంచి జెల్దే జీతాలు ప‌డ‌త‌య‌న్న‌మాట‌.”

“ఏమో చెప్ప‌లేం. ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీ అని అనుకుంటున్నార‌ట‌.
ఎప్పుడు ఏ జిల్లాకు ముందేస్త‌రో..? ఏ జిల్లాకు లాస్టుకేస్త‌రో తెల్వ‌దు.”

“ఇలా ఎన్నిరోజులురా బై.. జీతాల కోసం ఎదురుచూసే జీవితాలు..”

“అక్క‌డ పైస‌ల్లేవు మ‌రి.. అప్ప‌టి దాకా ఇంతే..”

“మ‌రి ద‌ళిత‌బంధుకేడికెళ్లి తెస్తుర్రా నాయ‌న‌…”

“వాళ్ల తంటాలు వాళ్లు ప‌డ‌త‌ర్రా బై నీకెందుకు?”

“కేంద్రం ఎఫ్ ఆర్ బీ ఎం కూడా బాగా త‌గ్గించిందంట క‌దా..”

“ఏడికెళ్లి అప్పులుతెస్త‌రు.. ఎట్లిస్త‌రు…?”

“వాళ్ల‌కు లేని ఫిక‌రు నీకే ప‌ట్టిందేమ్రో…”

“మ‌న ద‌గ్గ‌ర న‌యం రా నాయ‌న‌.. క‌నీసం ప‌దో తారీఖు వ‌ర‌క‌న్నా జీతాలు ప‌డుత‌న్న‌య్‌..”

“ఆంధ్ర‌లైతే ఇర‌వై తారీఖు దాటినా ఎదురుచూస్త‌నే ఉన్న‌రంట‌..”

“అవునా..?”

“ఆ మాట చెప్పినంక ఇప్పుడు మ‌న‌సు నిమ్మ‌ళ‌మైందిరా..”

“అంటే .. అంటే.. మ‌న‌మే న‌యం అంటావు….. అంతేనా?”

“అంతే. మూసుకుని ప‌నిచేసుకో…”