రేప‌టి నుంచి విద్యా సంస్థ‌లు తెరిచేందుకే స‌ర్వం సిద్ధం చేశారు. కానీ, ఇటు ప్ర‌భుత్వానికి, అటు యాజ‌మాన్యానికి , ఇంకోవైపు పేరెంట్స్‌కు ఇంకా అనుమానం వీడ‌లేదు. క‌రోనా వ‌చ్చేస్తుంద‌నే భ‌యం వెంటాడుతున్న‌ది. స‌ర్వం సిద్ధం అని ప్ర‌భుత్వం చెబుతున్న‌ది. కానీ స్కూల్ మేనేజ్‌మెంట్ మాత్రం బ‌స్సుల‌ను రెడీ చేసుకోలేదు. మ‌రో ప‌దిహేను రోజులు వేచిచూసే దోర‌ణిలో ఉంది. ఒక్క బ‌స్సు బయ‌ట‌కు తీయాలంటే ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని లెక్క‌లు వేసి.. ఇప్పుడు తీసి న‌డిపితే.. మ‌ళ్లీ స్కూళ్లు బంద్ అయితే.. ప‌రిస్థితి ఏంటీ? ఇప్పుడిదంతా హంగామా అవ‌స‌ర‌మా? అనే దోర‌ణిలో వాళ్లున్నారు. మ‌రో ప‌దిహేను రోజుల్లో ప్ర‌భుత్వం మ‌ళ్లీ స్కూళ్లు బంద్ చేయండ‌నే నిర్ణ‌యం తీసుకున్నా తీసుకుంటుంది అనే భావ‌న‌లో మేనేజ్‌మెంట్ ఉన్నారు. అందుకే వారు పూర్తిగా సన్న‌ద్ధం కాలేదు. కావాల్సిన టీచ‌ర్ల రిక్రూట్‌మెంట్ జ‌ర‌గ‌లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిద్ద‌రితో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఎక్కువ మంది టీచ‌ర్లు అవ‌స‌రం. మ‌రి వాళ్ల‌ను రిక్రూట్ చేసుకుంటే ఎన్ని రోజులు న‌డుస్తాయో తెలియ‌ని ప‌రిస్థితుల్లో.. వాళ్ల‌కు జీతాలెలా ఇయ్యాలి? ఇవ‌న్నీ సందేహాలు ముసురుకుని ఉన్నాయి. మ‌రోవైపు మూడో వేవ్ క‌రోనా వ‌చ్చింద‌నే ప్ర‌చారం హైద‌ర‌బాద్‌లో జ‌రుగుతున్న‌ది. సోష‌ల్ డిస్టెన్స్‌తో క్లాసులు ఎలా న‌డ‌పాలి? ఇరుకు త‌ర‌గ‌తి గ‌దుల్లో కుక్కి మ‌రీ అడ్మిష‌న్లు తీసుకున్నారు. అదే గిట్టుబాట‌య్యింది. ఇప్పుడు మంది క్లాసులో ప‌డ‌తారు? మిగిలిన‌వారి ప‌రిస్థితి ఏందీ? ఒక‌రిద్ద‌రికి క‌రోనా వ‌చ్చిన‌ట్టు తేలితే.. స్కూలే బంద్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశిస్తున్న‌ది. మ‌రి ఒక్క‌రికి జ్వ‌రం వ‌చ్చింద‌ని తేలితే.. మిగిలిన పిల్ల‌లు స్కూలుకు వ‌స్తారా? అస‌లు త‌ల్లిదండ్రులు బ‌డుల‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నారా?

మ‌రో వారం, ప‌ది రోజులు.. ఆ త‌ర్వాత ఈ బ‌డుల నిర్వ‌హ‌ణ ఎలా ఉంటుందో తేల‌నుంది?
క‌రోనా థ‌ర్డ్‌వేవ్ దోబూచులాట తేలిపోతుంది..?
ఫీజుల దోపిడీ ఏ రేంజ్‌లో ఉంటుందో బ‌య‌ట‌ప‌డుతుంది.
త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను పంపుతున్నారా? ఆన్‌లైన్ కావాలంటున్నారా? స్ప‌ష్ట‌మ‌వుతుంది.
ప్ర‌భుత్వానికి ఓ క్లారిటీ వ‌స్తుంది. ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది.

ప్ర‌యోగం విక‌టిస్తుంది. ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.

You missed