నమ్ముకున్న వాళ్లకు నమ్ముకున్నంత
చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత
ఆ రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు
ఇంకా గుర్తుంది.. నారా లోకేశ్ వెనుక కూర్చొని
జోక్స్ వేస్తూ ఎంతగా ఆనందపడ్డాడో రవి ప్రకాశ్
ఇప్పుడు ఏమయ్యాడు? ఎక్కడికి పోయాడు?
సొంత మీడియాలూ, మైకులూ టీడీపీకి ఉన్నాయి. సొంతం అనుకునే మీడియాలో ఏం వాగినా పర్లేదు అనుకునే నాయకులూ ఉ న్నారు. వారే ప్రమాదం. ఆ రోజు టీవీ నైన్ – లోకేశ్ బంధం గురించి ఎవ్వరూ మరిచిపోరు. కానీ ఓ చిన్న నేరారోపణ కా రణంగా ఇ ప్పుడు మీడియాలో అడ్రస్ లేకుండా పోయాడు రవి ప్రకాశ్. ఇప్పుడేం చె ప్తారు. ఇప్పుడేం చేస్తారు. పార్టీకి టీవీ నైన్ మద్దతు అవస రమే కాదనం కానీ నెత్తిన పెట్టుకున్నంత అవసరాలు అయితే ఏమున్నాయి. ఇవేవీ పరిగణించకుండా, ఇవేవీ పట్టించుకోకుండా ఆ రోజు టీవీ నైన్ తో పాటూ ఆంధ్రజ్యోతి ఛానెల్ ను తెగ వాడుకోవా లన్న తాపత్రయం కొంప ముంచింది. వాళ్లు చేసిన అతి కారణంగా టీడీపీ కోలుకోలేని దెబ్బలు తిన్నది. అయినా కూడా లోకేశ్ మారడం లేదు. కొన్ని మీడియాల్లో కనిపిస్తే చాలు అనుకోవడమే అతి ప్రమాదానికి సంకేతం.
మనం బాగున్నాం అనుకోవడం మంచిదే! బాగున్నాం కదా అని అతి చేయడమే ప్ర మాదం. ఈ అతి కొంపముంచింది. ఈ అతి గతి తప్పింది. ఈ గతి ఎవ్వరికీ అందకుం డా పోయింది. దీంతో పార్టీ ఇవాళ కొన్ని అనుకోని ప్రమాదాలను సైతం ఎదుర్కొం టుంది. టీవీ నైన్ రవి ప్రకాశ్ , శివాజీ , అప్పటి మంత్రి నారాయణ వీళ్లు చాలు ఆ రోజు పార్టీని ముంచేందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ పార్టీ మునిగి ఒడ్డుకు చేరలేక పోయింది అనేందుకు. నిండా ముంచినోళ్లంతా పాపం ఇప్పుడెక్కడికి పోయారో! ఏమ యిపోయారో! ఆయన వైబ్ కు ఉన్న ఆదరణేంటో..లోకేశ్ ఇప్పుడు ఇవన్నీ మననం చేసుకోవాలి. మీడియా అండ మంచిదే కానీ ముంచే శక్తుల జాడలు కనుగోగలగాలి. ఇ దే సందర్భంలో ఆంధ్రజ్యోతి ఓనరు రాధా కృష్ణ కూడా లోకేశ్ ను పక్కదోవ పట్టించిన వారే.! సుజనా, సీఎం రమేశ్ లాంటి లీడర్లు, అలానే కొందరు ఉన్నతాధికారులు, ఇం కొందరు సినిమావాళ్లు అంతా కలిసి లోకేశ్ ను ముంచేశారు.
ఆయన ఇప్పటికిప్పుడు తేరుకోలేరు. నాటి గాయాల కారణంగా పార్టీని బాగు చేద్దాం అన్నా ఇప్పటికిప్పుడు ఆ పనీ చేయలేరు.లోకేశ్ ! ఇప్పటికీ మించి పోయిందేమీ లే దు రవి ప్రకాశ్ కానీ రాధా కృష్ణ కానీ మరొకరు కానీ పార్టీని బాగు చేయరు. పార్టీ బా గుంటే నాలుగు రాళ్లు ఏరుకుంటారు. నాలుగు పైసలు ప్రకటనల రూపంలో మీ నుం చి అందుకుంటారు. అంతకుమించి వారు చేసేది కా నీ చేయగలిగింది కానీ లేదు. రా దు కూడా! అలాంటప్పుడు మీరు వారిని నమ్మడం శుద్ధ దండగ. ఆ పని గతంలో చే శారు సరే! ఇ కపై చేయకండి. మీడియాను కాదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ డియాను కాదు మీ శక్తి అంతకుమించి ఎదిగేలా చేసుకోం డి. మీ శక్తి మీరు తెలుసు కోవడంలోనే విజయం కానీ విజయ సంబంధ రహస్యం కానీ దాగి ఉంది కదా! మీరెం దుకు ఇంకా కొన్ని మీడియాలు నమ్ముకుని రాజకీయ జీవితాన్ని ప్రమాదంలో నెట్టుకుంటారు. సో.. ఈ విషయమై ఆలోచించండి.
Ratna kishore Sambumahanti