రేవంత్‌రెడ్డి.. పీసీసీ చీఫ్ అయిన తర్వాత తన దూకుడు పెంచాడు. మాటల దాడీ పెరిగింది. అంతకుముందే ఫైర్ బ్రాండ్‌గా పేరుపడ్డా.. ఇప్పుడు దానికి మరింత పదును పెడుతున్నాడు. కేవలం కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అరేయ్.. ఒరేయ్ అనేమాటలు కామాన్‌గా వాడేస్తున్నాడు. వాటికే మంచి స్పందన వస్తుందని, సభలు ఆ స్పీచ్‌తోనే సక్సెసవుతున్నాయని నమ్ముతున్నాడు. కానీ .. కేసీఆర్‌ను చాలా దగ్గరగా చూసిన వాళ్లు.. రేవంత్ రెడ్డి స్టైల్ చూస్తే కేసీఆర్‌ను కాపీ కొడుతున్నట్టే ఉంటుంది. వేదికలమీద ఆయన మాట్లాడేటప్పుడు ఎవరూ మాట్లాడొద్దు. తను చెప్పింది వినాలంతే. లేదంటే కసురుకుంటాడు. రేవంత్రెడ్డైతై రెండు దెబ్బలు కూడా వేస్తున్నాడు.
పార్టీ మొత్తం తన చెప్పు చేతల్లో ఉండాలంటే .. నియంతలా ఉండాలనేది కేసీఆర్ భావన. ఆయన అలాగే నడిపించారు. నడిపిస్తూ వస్తున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని కేసీఆర్ ఒప్పుకున్నాడు. అవును.. అనుకున్నది సాధించాలంటే.. వెనుక అడుగు పడకూడదంటే నియంతలా ఉండాలి.. తప్పు లేదు. నేను అలాగే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రేవంత్ కూడా పీసీసీ పగ్గాలు చేపట్టగానే … మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట అందరినీ మచ్చికచేసుకునే పనిచేశాడు. ఘర్ వాపసీతో ఎంతో కొంత మందిని లాగే ప్రయత్నమూ చేశాడు. ఇక తన నిజస్వరూపం, తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇంకా రేవంత్ స్టార్టింట్ ట్రబుల్ లోనే ఉన్నాడు. కేసీఆర్‌ను అనుకరించాలనుకుంటే కాంగ్రెస్‌లో కుదరదు. టీఆర్ఎస్లో ఎవరికీ స్వాత్రంత్యం ఉండదు. మాట్లాడే స్వేచ్చ అసలే ఉండదు. ఎదురితిరిగితే ఖతమే. ఇక్కడ ఎవరికి ఆలోచన వచ్చినా దాన్ని వెల్లడించే అవకాశం లేదు. అధినేత చెప్పిందే వినాలి. నచ్చినా నచ్చకపోయినా. కానీ కాంగ్రెస్‌లో అలా కాదు. ఓ నిర్ణయం తీసుకుంటే చర్చుండాలి. సమ్మతి కావాలి. ఒప్పించాలి. అందరి మద్దతు కూడగట్టాలి. సమిష్టిగా ముందుకు పోవాలి. కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తన గ్రాఫ్ పెంచుకునేందుకు, సోనియా, రాహుల్ వద్ద మార్కులు కొట్టేసేందుకు చాలా విషయాల్లో, నిర్ణయాల్లో సింగిల్‌గానే పోతున్నాడు. ఇది కొంతమంది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. ఇంద్రవెళ్లి సభలో ఇబ్రహీంపట్నం సభ అనౌన్స్ చేసేశాడు. ఎవడికడిగి సభ పెడుతున్నావని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుదరదు పో అన్నాడు. తోక ముడవక తప్పలేదు.
పీసీసీ చీఫ్‌గా తన మాటే వేదమనే భ్రమలో రేవంత్ ఉన్నాడు. ఇదే వైఖరితో ఉంటే.. మున్ముందు ఇంకా చాలా చేదు అనుభవాలు చూడాల్సి వస్తుంది. సభలో సోనియమ్మ పాట అందుకుని పదుల సార్లు ఆమె పేరు జపిస్తున్నాడు. పనిలో పని ఇక్కడ విషయాలు ఢిల్లీలో సోనియమ్మ ముందు పెడతా.. పరిష్కరిస్తా.. అనే డైలాగ్.. అప్పటి ఎన్టీఆర్ ఆత్మగౌరవ డైలాగ్‌ను తలపిస్తున్నది. కాంగ్రెస్ నేతలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఆయన తన స్పీచుల్లో విరివిగా వాడేవాడు. ఇది టీడీపీకి మంచి మైలేజీ ఇచ్చింది కూడా. అన్నిసార్లు జై సోనియమ్మ అన్నోడు.. ఒక్కసారి.. చివరకు జై తెలంగాణ అనలేడా? జై తెలంగాణ నినాదం
టీఆరెస్ పార్టీకే సొంతం అనుకున్నాడేమో.