నూతన వధువు సాయి శ్రియ ఏదో సరదాగా తన పెళ్లి బారాత్లో బుల్లెట్ బండి సాంగ్ పై చేసిన డ్యాన్స్ అందిరినీ ఫిదా చేసింది. గంటల్లోనే వైరల్గా మారి రాత్రికి రాత్రే ఆమె సెలబెట్రీగా మారింది. ఇప్పుడంతా ఇదో ట్రెండు. అప్పటి వరకు బుల్లెట్ బండి డుగ్గు డుగ్గు పాట అంతగా ఫేమస్ కాలేదు. వాడుకలో ఉన్నది. కానీ శ్రియ డీజే దరువుతో ఈ పాటకు కూడా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు నడుస్తున్నదంతా పెళ్లిళ్ల సీజన్. శ్రియ ఫేమస్ అయినట్టుగానే తమ పెళ్లి బారాత్లలో కొత్త దంపతులు ఇద్దరు డీజేకు దరువులెయ్యడం ట్రెండింగ్ గా మారింది. ఎవరికి వారు వీడియోలు తీసుకుంటూ నూతన వధూవరుల డ్యాన్స్ స్టెప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అనుకోకుండా సరదాగా శ్రియ చేసిన డ్యాన్స్ ఈ విధంగా కొత్త దంపతులందరికీ ట్రెండింగ్ దారి చూపించింది. వారూ ఫేమస్ కావాలనుకుంటున్నారు డ్యాన్సులు చేసి. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వారు బారాత్ డ్యాన్సుల కోసం కొత్తగా స్టెప్పులు కూడా నేర్చుకొని వస్తారేమో?