పులిని దూరంగా చూడాల‌నిపించింద‌నుకో.. చూసుకో..

పులితో ఫోటో దిగాల‌నిపించింద‌నుకో.. కొంచెం రిస్క‌యిన ప‌ర్లేదు .. ట్రై చేయ్యొచ్చు..

స‌రే, చ‌నువిచ్చింది క‌దా అని పులితో ఆడుకుంటే మాత్రం..

వే…టా…డే…స్త‌….ది

ఇది య‌మ‌దొంగ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సీన్ డైలాగ్‌…

ఇక్క‌డ ఫోటోలో క‌నిపిస్తున్న‌ది మాత్రం పులి కాదు. సింహం.

ఈ సింహాన్ని ద‌గ్గ‌ర‌గా చూడొచ్చు.. దాని ఫోటో కూడా దిగొచ్చు…

ఆడుకోవ‌డమూ చెయ్యొచ్చు.. కానీ వేటాడ‌దు.

ఎందుకంటే.. మ‌నం బోనులో అది ఆరు బ‌య‌ట‌. దాని ద‌గ్గ‌ర‌కు మ‌నం… మ‌న ద‌గ్గ‌ర‌కు అది ..

ఈ ఫోటో సాక్షిలో వ‌చ్చింది. చాలా బాగుంది. ఆక‌ట్టుకున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలోని హారిస్మిత్‌లో ఉన్న జీజీ సింహాల అభ‌యారణ్యంలో ఈ ఏర్పాటు చేశారు.

ఇలా బోనులో నిల‌బ‌డి చూడాల‌న్నా.. కొంచెం ధైర్యం కావాలనుకో….

You missed