న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ చెలిమెల (కుమ్మ‌రి) నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య చేసుకోవడానికి పురిగొల్పిన వారెవ‌రు? ప‌రిస్థితులేమిటి?

కొత్త ఎడిట‌ర్ కృష్ణమూర్తి వ‌చ్చిన నాటి నుంచి ఉద్యోగ భ‌ద్ర‌త పూర్తిగా పోయింది. క‌రోనా వేళ‌.. నిర్ధాక్షిణ్యంగా.. కనీసం మాన‌వ‌త్వం కూడా చూప‌కుండా వంద‌లాది మందిని రోడ్డున ప‌డేసి పాపం మూట‌గ‌ట్టుకున్నాడు కృ.తి. పైగా త‌న‌కు కేసీఆర్ పూర్తి అధికారాలిచ్చాడు. చెప్పిన‌ట్టు చేస్తారా? చ‌స్తారా? అని బెదిరింపులు. అంద‌రూ త‌న‌కంటే వ‌ణికిపోవాలి. చెప్పింది చేయాలి. లేదంటే ఉద్యోగం పోతుంద‌నే భ‌యం.. ఇలాంటి వాతావ‌ర‌ణాన్ని, ప‌రిస్థితుల‌ను క్రియేట్ చేయ‌డంలో కృ.తి స‌క్సెస‌య్యాడు.

ఎక్క‌డ ఏ మీటింగుకు పోయినా… ఉద్యోగాలు పోతున్నాయ్ జాగ్ర‌త్త‌..! అని న‌ర్మ‌గ‌ర్భంగా, గోతికాడిన‌క్క‌లా, న‌క్క విన‌యంలా ఆయ‌న మాట్లాడే మాట‌ల్లో అర్థం తెలియ‌నివారుండరు. ఎడిట‌ర్ త‌మ‌ను బెదిరిస్తున్నాడ‌నే విష‌యం వారికి తెలిసిపోయింది. ఇక ఎప్పుడు ఊడుతాయో తెలియ‌ని ఉద్యోగంలో క్ష‌ణ‌క్ష‌ణం భ‌యంభ‌యంగా భారంగా దీనంగా బ‌తుకులీడుస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌నే నాగ‌రాజు ఎదుర్కొన్నాడు. ఏడాది కింద‌నే న‌న్ను కాపాడండి అనే రీతిలో మంత్రి హ‌రీశ్‌కు సిగ్న‌ల్ ఇచ్చాడు. యాజ‌మాన్యానికి ప‌రోక్షంగా హెచ్చిరించాడు. ప‌ద్ద‌తి మార్చుకోండి. లేదంటే ఎంద‌రో బ‌లైపోతార‌ని. కానీ ఎవ‌రూ మార‌లే. ఎవ‌రూ ప‌ట్టించుకోలే. ఫ‌లితం.. నాగ‌రాజు బ‌లి.

త‌ను ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ అంటాడు కృ.తి. మీటింగుల్లో త‌నంత పోటుగాడు లేడ‌నే రేంజ్‌లో క‌ల‌రింగిస్తాడు. అధికార పార్టీ నేత‌ల‌ను ప‌ట్టించుకోన‌వ‌రం లేదంటాడు. మ‌న‌కు కేటీఆర్ జేబుల నుంచి డ‌బ్బులిస్తున్నాడు.. వేరే మంత్రులు, నేత‌ల గురించి మ‌న‌కెందుకు? వారి వార్త‌లు ఆపండి.. భ‌జ‌న ఆపండి .. అంటూ ఆద‌ర్శ‌వంత‌మైన స్పీచ్ .. అచ్చు కేసీఆర్ లాగే ఇస్తాడు. కానీ చెప్పేదొక‌టి చేసేదొక‌టి.

వార్షికోత్స‌వం యాడ్స్ పేరుతో వేధించుకు తింటాడు. టార్గెట్లు పెట్టి ఉంటావా? చ‌స్తావా? అనే రేంజ్‌లో ధ‌మ్కీలిస్తాడు. ఎవ‌రి ద‌గ్గ‌రికి పోవాలి యాడ్స్ కోసం.? అధికార పార్టీ నేత‌ల ద‌గ్గ‌రికే. మ‌రి వాళ్ల వార్త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోతే వాడెందుకు ఇస్తాడు. ఇయ్య‌డు. ఇత‌ర పార్టీ నేత‌ల ద‌గ్గ‌ర‌కు పోయే సీన్ లేదు. మ‌రి ఎక్క‌డ్నుంచి వ‌స్తాయి యాడ్స్‌? అవ‌న్నీ మాకు తెల్వ‌దు? తేవాలి గంతే. లేక‌పోతే పోతావ్ . ..

నాగ‌రాజు అందుకే పోయాడు. ఎడిట‌ర్ వేధింపులు.. మేనేజ్‌మెంట్ ఒత్తిళ్లే కార‌ణం. అత‌ను సూసైడ్ లెట‌ర్ రాయ‌లేక‌పోవ‌చ్చు. కానీ ఈ విష‌యాన్ని ఇప్పుడు న‌మ‌స్తే తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ఏ రూర‌ల్ విలేక‌రిని అడిగినా చెప్తాడు? అవును. ఇది వాస్త‌వం.

నాగ‌రాజు కుటుంబాన్ని న‌మ‌స్తే తెలంగాణ ఆదుకోవాలి. అధికార పార్టీ ఆదుకోవాలి. ఇంకా ఎవ‌రూ నాగ‌రాజులా బ‌లికాకుండా కాపాడాలి. కృ.తి ఆగ‌డాల‌ను అడ్డుకోవాలి. అధికార దుర్వినియోగంతో రెచ్చిపోతున్న ఆ ఎడ‌ట‌ర్ తోక క‌త్తిరించాలి. మీకు చేత‌కాదా? అయితే ఆ పాపంలో మీరు భాగ‌స్వాములే. వాళ్ల ఉసురు త‌ప్ప‌క త‌గులుతుంది.

You missed