మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.. అంద‌రు ముద్దుగా ద‌య‌న్నా అని పిలుచుకుంటారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ను క‌లిసి త‌న ఫౌంహౌజ్‌కు వ‌చ్చిన రైతుబంధు 1.45 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అంద‌జేసి త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. నిజంగా ద‌య‌న్నా నువ్వు గ్రేట్‌. ఇన్ని రోజులు ఈ రైతుబంధును ఎందుకు సీఎంకు తిరిగి ఇచ్చేయ‌లేదో? ఇప్ప‌డే గుర్తొచ్చిన‌ట్లు ఎందుకు ఇస్తున్నావో మాకైతే తెలియ‌దు.

కొంప‌దీసి నువ్వు ఇచ్చిన‌వ‌ని మ‌న మంత్రులంద‌రినీ ఇయ్య‌మ‌ని అన‌వు క‌దా.? ఏందీ మంత్రులే కాదు.. ఎమ్మెల్యేలు కూడా ఇయ్యాలంటావా? ఇదేందే.. ద‌య‌న్న‌.. సీఎం సారు ద‌గ్గ‌ర నువ్వు మంచిమార్కులు కొట్టేసేందుకు వాళ్లంద‌రినీ బ్యాడ్ చేస్తావా? అస‌లే వాళ్లంతా నీ యంత ఆసాములు కాదు. వంద‌ల ఎక‌రాలు లేవు. ప‌దో ప‌ర‌కో ఉంటాయి. క‌ష్ట‌ప‌డి వ్య‌వ‌సాయం చేసుకుంట‌రు. మొన్న‌నే ఊర్ల‌కు పోయి నాట్లు కూడా ఏసొచ్చిండ్రు. నువ్వంటే ఫామ్ హౌజ్‌ల ఉంట‌వు. వ్య‌వ‌సాయం చేయ‌వు. కానీ వాళ్లు చేసుకుంట‌రే ద‌య‌న్నా..

ఇట్ల నువ్వు రైతుబంధు వాప‌స్ ఇయ్య‌డంతోని సీఎం సారుకు కొత్త ఆలోచ‌నైతే రాదు క‌దా…
ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ రైతుబంధు బందు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డు క‌దా. స‌చ్చింది గొర్రె… వాళ్లెట్ల వ్య‌వసాయం చేసేది? ఎట్ల బ‌తికేదీ? ద‌య‌న్న‌కు ద‌య‌లేదు నిజంగా.

 

 

You missed