కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ నష్టాల సాకుతో పడుతూ లేస్తూ నడుస్తుంది. ఆర్టీసీతో జనాలకు విడదీయలేని బంధం. ఈ మధ్య కాలంలో కొంత మందికి కార్లు వచ్చినా.. ఎంతో మందికి ఈ ఆర్టీసీయే ఆధారం. ఈ ఫోటో యూపీకి చెందింది. ఎప్పడిదో తెలియదు. కానీ అక్కడి ఆర్టీసీ దుస్థితికి అద్ధం పడుతున్నది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి ఆర్టీసీకీ పెద్దగా ఒనగూరింది ఏమీ లేదు. రాజకీయాలు, యూనియన్ల గొడవలతో రచ్చకెక్కి రోడ్డు మీద పడి, ఆ తర్వాత పాలకుడి హామీలతో ఊపిరి పీల్చుకొని బతుకుజీవుడా అంటూ బతుకు చక్రం రోడ్డు మీద భారంగా కదులుతున్నది. హామీలు ఇంకా రోడ్డు మీద గుంతల్లాగే ఉన్నాయి. సమస్యలు అరిగిపోయిన ప్రగతి చక్రాల మాదిరిగానే ముక్కుతున్నాయి.
కొత్త బస్సులు లేవు. మోరాయించుకుంటూ నడిచే అవే పాత బస్సులు. గమ్యం చేరుకుంటామో లేదో అనే దుస్థితి. మూడు గంటల్లో చేరాల్సిన ప్రయాణం మరో రెండు గంటలు అదనంగా తీసుకుంటున్నది. అసలు ఆర్టీసీని లాభనష్టాల అంశంగా చూడడమే పొరపాటు. ప్రజా వైద్యం లాగే ఇది ప్రజలకు అవసరం. పాలకులు ఈ రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఎన్నో జీవితాలు, మరెన్నో వ్యాపార సంబంధాలు ఈ రవాణా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి.
“ఏంటీ సార్… ఈ బస్సు ఇంత స్లోగా పోతుంది” అని ఓ డ్రైవర్‌ను అడిగితే..
“ఇవి ఎన్నేండ్ల కిందవో బస్సులు? కొత్తవి కొనరు. ఇంద్ర బస్సులు తప్ప అన్ని స్క్రాప్
కు పోయేటివే.’
ఇది మన ఆర్టీసీ దుస్థతి.