కడుపుతో ఉన్న ఆడవాళ్ళతో నీకు మగపిల్లాడే పుట్టాలి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అంటారు కొంతమంది…
అసలు మీకేలా తెలుసు అయినా మగపిల్లాడికే ఎందుకు అంత ప్రాముఖ్యత…
పిల్లల్నీ ఎన్నో రకాల ఇబ్బందులు పడి , కష్టపడి కనేది ఆడవాళ్ళు… పిల్లల్ని పెంచేది ,సమాజంలో ఒక మనిషిగా తీర్చి దిద్దేది ఆడవాళ్ళు…
పుట్టిన దగ్గర నుండి చచ్చేదాక ఏ దశలో కూడా విరామం కోరకుండా పనిచేసే ఏకైక శ్రమ జీవి ఆడవాళ్ళు మాత్రమే…
ఇంత శాస్రీయత, టెక్నాలజీలు పెరిగి ఆడవాళ్ళు అన్నింటా రానిస్తుంటే ఇంకా ఆడవాళ్ళు పుట్టారంటే ఎందుకు
” అయ్యో ” అంటారు
మొదట కాన్పులో ఆడబిడ్డ పుట్టింది…
రెండవ కాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టింది…
అయ్యో… అవునా ఛా… మగపిలగాడు పుట్టి ఉండాల్సింది
అని ఎవరైనా అంటే చెంప చెడేలుమనిపించి…
యే ఆడపిల్లలు పుడితే తప్పేంటి నువ్వు పైనుండి ఊడిపడ్డావా… ఆడదానికి కాదా నువ్వు పుట్టింది అని గట్టిగా కడిగేయాలి అనిపిస్తుంది…
ఇంత చదువుకున్నాం కదా… ఆడవాళ్ళని పుట్టనివ్వాలి , వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలి, అని కొంచెం కూడా మెదడుకు అర్థం అవ్వకపోతే మనం పొందిన జ్ఞానానికి విలువేది…
ఖచ్చితంగా చెబుతున్నా నువ్వు సచ్చాక ఎక్కడుందో తెలియని పున్నామ నరకం నుండి నిన్ను కాపాడేవాడు కాదు నీ కొడుకు…
నువ్వు విరామం కోరిన రోజున నీ నోటికి కూడు అందించే నీ కోడలు/ కూతురు మాత్రమే… అంటే ఆడవాళ్ళు మాత్రమే నువ్వు బ్రతికుండగా నిన్ను కాపాడుకునేది…అసలు ఆడవాళ్ళ త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే…
ఆడదానివి అయి ఉండి నీ ఇంట్లో ఆడపిల్లలు పుడితే అయ్యో అంటున్నావంటే అసలు నువ్వు ఆడవారి విలువలు గురించి చాలా తెలుసుకోవాలి…
దయచేసి ఆడపిల్లల్నీ పుట్టనివ్వండి… సమాజంలో ఎదగనివ్వండి…
— నవ జీవన ప్రియ