లింగంపేట మండలం శేట్‌పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగొంతం ఎల్లవ్వ (48)ను తన కొడుకు చేతిలోనే హత్యకు గురైంది. భూమి కోసం కనిపెంచిన కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఎల్లవ్వ పేరుమీదున్న భూమిని తన పేరు మీదకు మార్చాలని చాలా రోజులుగా కొడుకు, కోడలు ఆమెతో గొడవ పడుతూ వస్తున్నారు. కానీ ఎల్లవ్వ భూమిని కొడుకు పేరు మీదకు బదలాయించలేదు. దీంతో కక్షగట్టిన కొడుకు తన భార్యతో కలిసి రాత్రి పూట ఆమె పడుకున్న సమయంలో గొంతు నులిమి చంపేశారు. ఉదయం ఈ విషయం బయట పడడంతో కొడుకు, కోడలు పరారయ్యారు. పోలీసులు కొడుకు రాజు, కోడలు లక్ష్మి పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు.
